Anna Ben in Kalki 2898 AD Movie Kiara role

Anna Ben: ప్రభాస్ హీరో గా నటించిన “కల్కి 2898 AD” చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా నడుస్తోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ పాన్-ఇండియా సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల కలెక్షన్స్ అందుకుని మరిన్ని రికార్డుల ను బద్దలు కొట్టడానికి ముందుకు దూసుకెల్తుంది. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను నెలకొల్పుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్లు అమితాబ్, దీపికా పదుకొణె, దిశా పటానీ నటించగా సౌత్ స్టార్స్ కమల్ హాసన్, ఆర్జీవీ, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ లు ముఖ్య పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

Anna Ben in Kalki 2898 AD Movie Kiara role

అయితే ఈ చిత్రంలో ఓ మలయాళీ స్టార్ హీరోయిన్ కూడా ప్రధాన పాత్ర పోషించింది. కల్కి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే కుర్రాళ్లకు బాగా నచ్చేసింది. ప్రస్తుతం ఈ అందాల తార చిన్ననాటి ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా..ఆమె అన్నా బెన్. కల్కిలో కైరా పాత్రను ఈ బ్యూటీ పోషించింది. తన గిరజాల జుట్టు, అల్లరి, చిరునవ్వు మరియు సహజమైన నటనా శైలితో ఆమె అందరి హృదయాలను దోచుకుంది.

Also Read: Santhosham: సంతోషం సినిమా లో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉందొ తెలుసా!!

పలు మలయాళ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర ఈమె సినీ కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అన్నా బెన్ మలయాళ స్క్రీన్ రైటర్ బెన్నీ పి నాయరాంబలం కుమార్తె. కుంబళంగి నైట్స్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ మరదలి పాత్రలో నటించగా హెలెన్ మరియు కప్పెలాతో సినిమాల తో  భారీ విజయాన్ని అందుకుని ఆకట్టుకుంది.

కాపెల్లా చిత్రంలో తన నటనకు అన్నా బెన్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది. “కసరా”, “నారదన్”, “నైట్ డ్రైవ్”, “కప్ప”, “త్రిశంకు” వంటి మలయాళ చిత్రాలలో కూడా ఆమె నటించగా ఇప్పుడు కల్కి సినిమాతో తెలుగు, తమిళం, కన్నడ ప్రేక్షకులను ఫిదా చేసింది. అన్నా బెన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన లేటెస్ట్ క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటుంది.