Anushka Shetty Super Movie Sonu Sood

Sonu Sood: COVID లాంటి కష్ట సమయాల్లో సేవ చేసి ప్రజలకు దేవుడు అయ్యాడు. ఇంటికి తిరిగిరాలేని చాలా మందికి సోనూసూద్ సహాయం చేశాడు. సినిమాల్లో విలన్‌గా నటించినా.. నిజ జీవితంలో మాత్రం సూపర్‌హీరో అనిపించుకున్నాడు. సోనూ సూద్ నిస్సందేహంగా ఆపదలో ఉన్న పేదలకు సహాయం చేస్తాడు. ఇప్పటి వరకు ఎంతో మందికి సాయం చేశాడు.. చేస్తునే ఉన్నాడు. అలాగే తన అభిమానుల కోసం ఏదో ఒకటి చేస్తున్నాడు. ఇక ఇప్పుడు సోనూ సూద్ తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా సినిమాలను నిర్మిస్తున్నాడు. అయితే సోనూసూద్‌ ఒక స్టార్‌ హీరోయిన్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడని చాలా మందికి తెలియదు.

Anushka Shetty Super Movie Sonu Sood

అవును, సోనూ సూద్ ఒక హీరోయిన్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇప్పుడు ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆమె ఎవరో తెలుసా?ఆమె మరెవరో కాదు హీరోయిన్ అనుష్క శెట్టి. అవును, సోనూసూద్ ద్వారా అనుష్క శెట్టి ఇండస్ట్రీకి పరిచయమైంది. అనుష్క మొదటి సినిమా ‘సూపర్’. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు సోనూసూద్ కూడా నటించాడు. పూరిజగన్నాథ్ ఈ సినిమా కోసం సోనూసూద్‌ని కలిసినప్పుడు హీరోయిన్ పాత్ర గురించి చెప్పాడట. దాంతో సోనూ వెంటనే పూరీకి అనుష్కను పరిచయం చేసి, జిమ్‌లో ఒక అమ్మాయిని చూశానని, ఆమె మీరు చెప్పిన పాత్ర కి పర్ఫెక్ట్ సెట్‌ అవుతుందని చెప్పాడు.

Also Read: Bandi Sanjay: బీజేపీ పార్టీలోకి హరీష్ రావు?

ఆ తర్వాత పూరి జగన్నాథ్ ఆమెకు కథ చెప్పి కథానాయికగా నటించేందుకు అనుష్క అంగీకరించారట. ఈ విషయాన్నీ సోనూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే చాలా మంది అనుష్కను నాగార్జున ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారని అనుకుంటారు. మరికొందరు పూరీ జగన్నాథ్‌ ఆమెను సినిమాలోకి తీసుకొచ్చారని అంటుంటారు. అయితే నిజానికి అనుష్కను రికమెండ్ చేసింది సోనూసూద్. ఇక ఇప్పుడు అనుష్క కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ దాదాపు టాలీవుడ్ హీరోలందరితోనూ నటించింది.

హీరోలతో పాటు సమానంగా మార్కెట్ ను ఏర్పరుచుకున్న ఈమె ఇప్పుడు సినిమా స్పీడ్ తగ్గించింది. ఆమె నటించిన ఆఖరి సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఆ తర్వాత ఆమె సినిమాల ను పెద్ద గా ఒప్పుకోవడం లేదు. చేస్తుందో లేదో కూడా తెలీదు. “సూపర్” సినిమా తర్వాత అనుష్క సోనూసూద్‌తో కలిసి “అరుంధతి” సినిమాలో నటించింది. ఈ సినిమాలో సోనూసూద్ విలన్‌గా నటించగా ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాతోనే అనుష్క టాప్ హీరోయిన్ గా అవతరించింది.