Ms Dhoni: మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. అంతేకాకుండా పోస్టులు కూడా చాలా తక్కువ చేస్తూ ఉంటారు. తనకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోటోలు పోస్ట్ చేస్తారు. కానీ రీసెంట్ గా ధోని …..అంబానీల పెళ్లికి హాజరయ్యారు. ఇక ఆ పెళ్లిలో దిగిన ఓ ఫోటోను ధోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో వింతేముంది. పెళ్లికి వెళ్లిన ప్రతి ఒక్కరూ అంబానీల పెళ్లికి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేశారు. Ms Dhoni

MS Dhoni hugs new bride Radhika Merchant in happy PIC from her wedding with Anant Ambani

కానీ ధోని పోస్ట్ చేసిన ఫోటో మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. ధోని ….అంబానీల గురించి కాకుండా అమ్మాయి తరపున వాళ్ల గురించి ….ముఖ్యంగా పెళ్లికూతురు రాధిక గురించి ఫోటో పోస్ట్ చేసి స్పెషల్ గా రాధిక గురించి రాసుకోచ్చారు. రాధికను హగ్ చేసుకున్నటువంటి ఫోటోలు పోస్ట్ చేసి…. రాధిక స్వచ్ఛమైన వెలుగును జిమ్మే నీ నవ్వుని ఎప్పుడు చెదిరిపోనివ్వకు. అనంత్ దయచేసి ఎప్పటిలాగే ఉత్సాహంగా ఉండు. Ms Dhoni

Also Read: Rahul Dravid: SRHలోకి రాహుల్.. బ్లాంక్ చెక్ ఇచ్చిన కావ్యా పాప ?

నువ్వు…. నీ చుట్టూ ఉండే మనుషులను ఎంత ప్రేమగా చూసుకుంటావో రాధికను కూడా అలానే చూసుకో. మీ వైవాహిక జీవితం సంతోషంగా …. బోలెడన్ని నవ్వులతో…. అడ్వెంచర్స్ గా సాగాలని కోరుకుంటున్నాను….. త్వరలోనే మళ్లీ మిమ్మల్ని కలుస్తానంటూ రాసుకొచ్చారు. పైగా ఆ పోస్ట్ కు రాజీ సినిమాలోని దిల్ భరో సాంగ్ ని ఆడ్ చేసి వీరెన్ మర్చంట్ ఈ పాట మీ కోసమే అంటూ ఫన్ క్రియేట్ చేశారు. Ms Dhoni

వీరెన్ మర్చంట్ అంటే రాధిక మార్చంట్ తండ్రి పేరు. బాలీవుడ్ సైన్యం అంతా అనంత్ సైడ్ నుంచి పెళ్లికి వచ్చి హడావిడి చేస్తే…. ధోని మాత్రం అమ్మాయి తరఫున నుంచి పెళ్లికి వచ్చాడు అన్నమాట. ఇక పెళ్లికి తన కుటుంబ సభ్యులతో వచ్చి ధోని సందడి చేశారు. ప్రస్తుతం ధోని పోస్ట్ చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. Ms Dhoni