Rakul Preet singh Brother Caught

Rakul Preet Singh: తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ వినియోగంపై గత కొన్ని రోజులుగా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. అనేక కొత్త మార్గాల ద్వారా డ్రగ్స్ మరియు గంజాయిని నగరానికి తీసుకు వస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి యువకులకు వ్యాపారులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ కేసు లో ఓ సంచలనం నెలకొంది. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నార్కోటిక్స్ బ్యూరో, రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులు భారీ ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు నైజీరియన్లు, సెలబ్రిటీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Rakul Preet singh Brother Caught

అంతేకాకుండా ఈ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో డ్రగ్స్ కేసుల్లో రకుల్ ప్రీత్ సింగ్ పేరు ప్రస్తావనకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు బీఆర్ఎస్ తో సాన్నిహిత్యం దృష్ట్యా ఆమె పేరు ఎక్కువగా బయటకు రాలేదు అని అందరు అంటూ ఉంటారు. ఏదేమైనా ఈ సారి ఆమె తమ్ముడు పేరు వెలుగులోకి రావడం సంచలనం అనే చెప్పాలి. ఇంకా ఎంతమంది సెలేబ్రిటీలు లిస్టు బయటకు వస్తుందో చూడాలి. 

Also Read: Taapsee Pannu:  అంబానీ పెళ్లి కి సెలెబ్రిటీ ల రాక పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన హీరోయిన్!! 

చాలా రోజులుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల “ఇండియా 2” సినిమాతో దక్షిణాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమల్ హాసన్ నటించిన ఈ సినిమా జూలై 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇందులో రకుల్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయి లో అలరించలేక పోయింది. దాదాపు రాకుల్ కెరీర్ కూడా ముగిసిపోయినట్లే అని చెప్పాలి. ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.