Santhosham Movie Heroine Gracy Singh

Santhosham: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్ లు ఒక్క సినిమాతో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. తమ అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న చాలా మంది మొదటి సినిమాతో ఫేమస్ అయ్యాక ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. ఒకట్రెండు సినిమాల్లో కనిపించి ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. వారిలో గ్రేసీ సింగ్ ఒకరు. ఆమె పేరు చెబితే ఎవరికీ తెలీదు కానీ నాగార్జున సినిమా సంతోషం సినిమా హీరోయిన్ అని చెబితే మాత్రం ఆ హీరోయిన్ గుర్తొస్తుంది. ఈ సినిమా అక్కినేని నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి. ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రంలో శ్రియా శరణ్ మరియు గ్రేసీ సింగ్ కథానాయికలుగా నటించగా విశ్వనాథ్ మరియు పృథ్వీ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో నాగార్జున, గ్రేసీ సింగ్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది.

Santhosham Movie Heroine Gracy Singh 

ఈ జంట కాంబో లో వచ్చిన “దేవుడే దిగివచ్చినా.. తాజ్ మహల్ నాకిచ్చానా..” అనే పాట ఇప్పటికీ చాలా ఫేమస్. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది గ్రేసీ. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్లు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. “సంతోషం” తర్వాత ఆమె “మోహన్ బాబు” మరియు శ్రీకాంత్ నటించిన “అప్పు చేసి పప్పు కూడు” చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. గ్రేసీ సింగ్ తెలుగు సినిమాల్లోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం మరియు పంజాబీ సినిమాల్లో కూడా చేసింది.

Also Read: Kalki 2898AD: కల్కి సినిమా లో కమాండర్ ‘మానస్’ గా నటించిన నటుడెవరో తెలుసా? అయన కూతురు కూడా..!!

అమీర్ ఖాన్ సరసన గ్రేసీ సింగ్ నటించిన హిందీ చిత్రం “లగాన్” సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో గ్రేసీ నటన ఉత్తరాది ప్రేక్షకులపై తీవ్ర ముద్ర వేసింది. ఆ తర్వాత “గంగాజల్”, “మున్నాబాయి ఎంబీబీఎస్” వంటి చిత్రాల్లో నటించింది. ఆమె చివరిగా 2015లో పంజాబీ చిత్రంలో కనిపించింది. గ్రేసీ సింగ్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నట్లు కనిపిస్తోంది. భరతనాట్య నృత్య కళాకారిణి అయిన గ్రేసీ తన పేరు మీద గ్రేసీ సింగర్ డ్యాన్స్ కంపెనీని స్థాపించి దేశ విదేశాల్లో నృత్య ప్రదర్శనలు చేస్తోంది. ఆమె బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో కూడా సభ్యురాలు. తరచూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది. అదనంగా, ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె ఫోటోలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి.