Anushka Malhotra Latest Glamour Photos 

Anushka Malhotra: సూపర్ స్టార్ చిరంజీవి నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ‘డాడీ’ సినిమా ఒకటి. ఈ చిత్రం 2001లో విడుదలై మంచి విజయం సాధించగా ఈ సినిమాలో మెగా స్టార్ నటన మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మెగా స్టార్ సరసన సిమ్రాన్ నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించగా ఈ చిత్రంలో చిరంజీవి తండ్రిగా అద్భుతంగా నటించాడు. మొదట ఈ సినిమా ను వెంకటేష్ తో చేయాలనుకున్నారు కానీ అది చిరంజీవికి తో చేయడానికి ఒప్పించారు. సినిమా విడుదలైన తర్వాత వెంకటేష్ కూడా ఈ సినిమా చూసి చిరంజీవి గురించి అదే మాట చెప్పాడు.

Anushka Malhotra Latest Glamour Photos 

అయితే ఈ సినిమాలో మెగాస్టార్ కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా? చిరంజీవికి చిన్న అమ్మాయికి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమా లో హృదయాన్ని హత్తుకునే కొన్ని సన్నివేశాలు చాలా ఉన్నాయి. అయితే ఆ చిన్నారి ఎవరు? ఇప్పుడు ఎలా ఉంది? అనే విషయం అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. డాడీ సినిమాలో చిరంజీవి కూతురిగా నటించిన ఆ చిన్నారి ఇప్పుడు బాగానే పెరిగిపోయింది. హీరోయిన్ లు కూడా కుళ్లిపోయేంత అందంగా తయారైంది. ఆమె పేరు అనుష్క మల్హోత్రా.

Also Read: Ram Charan: రామ్ చరణ్ కు అరుదైన గౌరవం.. అందుకే లండన్ ప్రయాణమా..?

ముంబైకి చెందిన అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తెలిసిన వ్యక్తి ద్వారా వచ్చింది. అయితే తొలి సినిమా తోనే చిరంజీవి సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టం.ఈ సినిమాలో తన క్యూట్ మాటలతో ప్రజలను ఆకట్టుకున్న చిన్నారి ఇప్పుడు హాట్ లుక్‌లోకి మారిపోయింది. చదువుపై దృష్టి పెట్టే క్రమంలో ఈ అమ్మడు ఆ తర్వాత సినిమాలో కనిపించలేదు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా  ఉన్న ఈ చిన్నారి ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ అమ్మడికి సంబంధించిన గ్లామరస్ ఫోటోలు ఇటీవల ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ చిన్నారి అందం అందరిని మంత్రముగ్దులను చేస్తుంది. ఈ బ్యూటీ తాజా ఫోటోలను మీరూ చూడండి.

https://www.instagram.com/anush.malhotra/?hl=en