Mahesh Babu rajamouli movie news

Mahesh Babu: ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ వివాహం అంగరంగ వైభవంగా జరగగా ఈ వివాహానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. హాలీవుడ్, బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు హాజరయ్యారు. రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, షారుక్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్, యష్, మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, రేఖ.. ఇలా సినీ తారలు అంబానీ పెళ్లి విడిది లో సందడి చేశారు.

Mahesh Babu rajamouli movie news

ముఖ్యంగా ఈ పెళ్లిలో మహేష్ బాబు తన స్టైలిష్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇదిలా ఉంటే మహేష్ బాబు హీరో గా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు తన జుట్టును పొడవుగా పెంచుతున్నట్లు ఆయన తాజా లుక్ ను బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే రాజమౌళి మహేష్ బాబు మధ్య ఓ విచిత్రమైన పరిస్థితి నెలకొంది.రాజమౌళి పెట్టిన ఓ షరతును మహేష్ బాబు మీరారట. మహేష్ కూడా అంబానీ పెళ్లి కోసం ఆ నిబంధనను ఉల్లంఘించాడట.

Also Read: Pumpkins: ఈ వర్షాకాలంలో.. గుమ్మడికాయ తింటే… 100 రోగాలకు చెక్.. కానీ ఇలా మాత్రం తినకూడదు ?

RRR లాంటి భారీ విజయం తర్వాత రాజమౌళి SSMB29లో పని చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమా గురించి తెలిసినప్పటి నుంచి జనాలు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. భారతీయ చలనచిత్రరంగంలో మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఇది ఒకటి. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ రివీల్ చేయకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నాడు. అందుకే మీడియాకు దూరంగా ఉండాలని మహేష్ బాబుకు సలహా ఇచ్చాడు. అయితే ఇప్పుడు మహేశ్ బాబు అనంత్ అంబానీ పెళ్లి వెళ్లి తానే స్వయంగా దాన్ని బయటపెట్టాడు. అనంత్ అంబానీ, రాధికల వివాహానికి మహేష్ బాబు తన కుటుంబంతో సహా హాజరయ్యారు. మహేష్ బాబు తన భార్య మరియు కుమార్తెతో వెళ్ళగా అక్కడ క్రికెటర్ ఎంఎస్ ధోనీతో కలిసి ఉన్న ఫోటోను మహేష్ బాబు స్వయంగా పోస్ట్ చేశాడు. ఈ ఫోటోపై అభిమానులు విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు.