Ram Charan Focuses on RC16 Movie 

RC16:  ఆర్ ఆర్ ఆర్ సినిమా తో సూపర్ క్రేజ్ అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది విడుదల కాబోతుంది అంటున్నారు. అయితే శంకర్ వరుస ఫ్లాప్ లలో ఉన్న నేపథ్యంలో ఈ సినిమా రామ్ చరణ్ కు హిట్ ను తీసుకోస్తుండా అనేది చూడాలి. ఇక ఈ సినిమా తరవాత ఉప్పెన స్టార్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.  మొదటి సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన బుచ్చిబాబు ఈ సినిమా ను పాన్-ఇండియా స్థాయి లో చేస్తున్నాడు.

Ram Charan Focuses on RC16 Movie 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంటి హీరోను తన రెండో సినిమాతోనే డైరెక్ట్ చేస్తున్నాడు అంటే మాములు విషయం కాదు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా తన కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోతుందని చెర్రీ అంటున్నారు. అందుకే ఓ పాపుల‌ర్ స్టార్‌ని ఈ సినిమాలో పెట్టారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమా లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సౌత్ సినిమాల్లో గెస్ట్ పాత్రలలో చేయడం లో ఈ హీరో సూపర్ పాపులర్ అయ్యాడు. ఇతర హీరోల సినిమాల్లో కనిపిస్తే ఆ సినిమా బజ్ క్రియేట్ చేస్తుందని ఇప్పటికే పేరొచ్చింది. గతంలో బాలకృష్ణ హీరోగా నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణిలో శివరాజ్‌కుమార్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించారు. ఆ సినిమా ఘనవిజయం సాధించింది.

Also Read: Shanvi Srivastava: అందాల హద్దులు చెరిపేసిన శాన్వీ.. ఏమందం బాబోయ్!!

రజనీకాంత్ జైలర్ సినిమాలో కూడా శివన్న అతిధి పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాల్లో శివన్న కూడా కొద్ది నిమిషాల్లోనే తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ధనుష్ హీరో గా నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా లో కూడా శివరాజ్‌కుమార్‌ నటించారు. అందుకే ఆయన్ని ఈ సినిమా లో నటింప చేయాలనీ చిత్ర బృందం ప్రయత్నం చేసింది. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో స్పోర్ట్స్ వారియర్‌గా శివన్న నటన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుందని అంటున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో కూడా నటిస్తుండడంతో ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు అంటున్నారు. మరి త్వరలోనే మొదలవబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.