Shanvi Srivastava latest glamorous photos 

Shanvi Srivastava: తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న నార్త్ ముద్దుగుమ్మ లలో శాన్వీ శ్రీవాత్సవ ఒకరు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి వచ్చిన ఈ ముద్దు గుమ్మ కథానాయికగా అరంగేట్రం చేయడానికి ముందు చిన్నా చితక పాత్ర చేసేది. ఆమె సోదరి విదిషా శ్రీవాత్సవ కూడా చిత్రాలలో నటించేది. శాన్వీ శ్రీవాత్సవ 2012లో బి. జయ దర్శకత్వం వహించిన ‘లవ్లీ’ చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైంది. ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్నారు. మంచి అభినయం తో పాటు.. బొద్దుగా ఉండే శాన్వీ మంచి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ.. తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్‌ను అందుకుంది. తన అందం, అభినయం తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా మరిన్ని సినిమా అవకాశాలను అందుకుంది.

Shanvi Srivastava latest glamorous photos 

ఆ తర్వాత సుశాంత్ సరసన “అడ్డా” చిత్రంలో నటించింది. ఈ బ్యూటీ సినిమాలు చేస్తూనే తన చదువును కొనసాగించింది. తెలుగులో ఆమె చివరిగా “రౌడీ” మరియు “ప్యార్ మే పడిపోయానే” చిత్రాలలో కనిపించింది. కన్నడలో ‘చంద్రలేఖ’ చిత్రంతో ఆమె తొలిసారిగా నటించింది. దీని తర్వాత ఈ కన్నడ కస్తూరికి శాండల్‌వుడ్ లో ఓ రేంజ్ ఆఫర్స్ వచ్చాయి. ‘మాస్టర్ పీస్’, ‘భలే జోడి’, ‘సుందరంగ జానా’, ‘సాహెబా’, ‘అవనే శ్రీమన్నారాయణ’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది సాన్వి శ్రీవాత్సవ.

Also Read: Anushka Malhotra: చిరంజీవి ‘డాడీ’ సినిమా లో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

ఆ తర్వాత ఇప్పటివరకు మరే తెలుగు సినిమాలోనూ నటించని శాన్వీ తన గ్లామర్ చిత్రాలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ‘లవ్లీ’ మూవీలో బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఇంకా సెక్సీగా కనిపిస్తోంది. తాజాగా ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందాల హద్దులు చెరిపేస్తూ ఆమె చేసిన గ్లామరస్ ఫోటో షూట్ లు అభిమానులను పిచ్చేక్కిస్తున్నాయి. ప్రస్తుతం సాన్వి శ్రీవాత్సవ చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆమె ‘త్రిశూలం’ (కన్నడ) మరియు ‘రంతి’ (మరాఠీ) అనే సినిమాల్లో నటిస్తోంది.