Vishwak Sen doing power peta movie

Vishwak Sen: అదృష్టం కొద్ది హీరో అయ్యి ఒక్క హిట్ లేకపోయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండతో హీరో గా కొనసాగుతున్నాడు విశ్వక్ సేన్. ఈ హీరో చేసిన సినిమా లు కనీసం కూడా అడలేడనే విషయాన్నీ ఎవరైనా చెప్తారు. అయన హీరో గా చేసిన గత సినిమా గల్లంతయ్యింది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో చేసిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమా దారుణంగా విఫలం అయ్యింది. పొలిటికల్‌ నేపథ్యంలో చేసిన ఈ సినిమా విశ్వక్ కి నిరాశే మిగిల్చింది. అయితే మళ్లీ ఇలాంటి కథ తోనే విశ్వక్ సేన్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. 

Vishwak Sen doing power peta movie 

ధమ్కీ, గామీ, గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాలు కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. అది పక్కన పెడితే విశ్వక్ తాజాగా మరో బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడట. పవర్ పేట అనే సినిమాని పాటల రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. నితిన్ కథానాయకుడిగా ఆ సినిమా చేయాలనుకున్నారు. దీనిని రెండు భాగాలుగా చేయనున్నట్లు కూడా ప్రకటించారు. కానీ చివరి క్షణంలో ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత శర్వానంద్ చేయాలనీ ప్రయత్నించినా అది కూడా కుదరలేదు. ఈ గ్యాప్ లోనే కృష్ణ చైతన్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని రూపొందించాడు.

Also Read: Ram Charan: రామ్ చరణ్ కు అరుదైన గౌరవం.. అందుకే లండన్ ప్రయాణమా..?

“పవర్ పేట” కూడా ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామా కాగా దీన్ని విశ్వక్ తో చేసే ప్రయత్నం చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ చాలా బిజీగా ఉన్నారు. మెకానిక్, లైలా అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే మరో సినిమాపై దృష్టి పెట్టనున్నారు. అప్పటి దాకా కృష్ణ చైతన్య పవర్ పేట థీమ్ ని విశ్వక్ కి తగ్గట్లుగా మార్చగలిగితే ఈ ప్రాజెక్ట్ ని ఆశించవచ్చు.  మరి నితిన్, శర్వానంద్ కాదన్న కథలో విశ్వక్ నటిస్తాడో లేదో చూడాలి.