Aman Preet Singh in drug case.. That heroine in tension

Aman Preet Singh: డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ పోలీసులకు దొరికిపోయిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ కేసులో ఇంకా కొంతమంది సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ అమన్ ప్రీత్ సింగ్ కి టెస్ట్ చేయగా పాజిటివ్ రావడంతో ఈయన దగ్గర డ్రగ్స్ తీసుకున్న వాళ్లు ఈయనకి ఫోన్ చేసిన వాళ్లందరూ భయపడిపోతున్నారట. ఎందుకంటే ఫోన్ కాంటాక్ట్ ద్వారా ఎక్కడ దొరికిపోతామో అని హాడలెత్తి పోతున్నారట.

Aman Preet Singh in drug case.. That heroine in tension

ఇక ఓ హీరోయిన్ కూడా భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టు మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. అసలు విషయం ఏమిటంటే.. రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ఓ సినిమాలో హీరోగా చేశారు.అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన పలు జిమ్ సెంటర్లను నడుపుతూ ఉంటారు. అయితే అలాంటి అమన్ ప్రీత్ సింగ్ గత కొద్ది రోజులుగా టాలీవుడ్ హీరోయిన్ సీరత్ కపూర్ తో రిలేషన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే.(Aman Preet Singh)

Also Read: Tamannaah: అంబానీ పెళ్లికి తమన్నా వేసుకున్న బ్లాక్ కలర్ లెహంగా ధర తెలిస్తే షాకే.?

రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లిలో స్పెషల్ గా కనిపించింది సీరత్. అలాగే వీరు ఏ వెకేషన్ కి వెళ్ళినా కూడా కచ్చితంగా సీరత్ కపూర్ కూడా వీరితో కనిపిస్తుంది. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు మీడియాలో చాలా వైరల్ గా మారాయి.అయితే తాజాగా డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ దొరికేసరికి సిరత్ కపూర్ చాలా భయపడిపోతున్నట్టు తెలుస్తోంది.అంతేకాదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.

Aman Preet Singh in drug case.. That heroine in tension

అయితే సీరత్ కపూర్ కి డ్రగ్స్ తో ఏమైనా సంబంధం ఉందా.. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కి కూడా ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో ఇంకా ఎంతమంది నిందితులుగా బయటపడతారో. ఇక సీరత్ కపూర్ తెలుగులో శర్వానంద్ తో రన్ రాజా రన్, మనమే వంటి మూవీస్ లో చేసింది. అలాగే టచ్ చేసి చూడు,రాజు గారి గది, భూమాకలాపం వంటి సినిమాల్లో నటించింది.(Aman Preet Singh)