Did Sharwanand really love that singer

Sharwanand: స్టార్ హీరోల సినిమాల్లో తమ్ముడు పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కున్నారు శర్వానంద్.సంక్రాంతి, లక్ష్మీ, శంకర్ దాదా ఎంబిబిఎస్ వంటి సినిమాల్లో నటించారు. అయితే అప్పటి వరకు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ఈయన యువకుడు సినిమాతో నలుగురు హీరోల్లో ఒకరిగా చేశారు.ఇక మొదటిసారి ఈయనకు హీరో గుర్తింపుని తెచ్చింది గమ్యం మూవీ. ఈ సినిమా అనుకోకుండా హిట్ అవ్వడంతో శర్వానంద్ రేంజ్ మారిపోయింది అని చెప్పుకోవచ్చు.

Did Sharwanand really love that singer

ఆ తర్వాత అందరి బంధువయ్యా, ప్రస్థానం, నువ్వా నేనా, రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇది రాని రోజు,ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు, పడి పడి లేచే మనసు,జాను, శ్రీకారం, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం శర్వానంద్ టైర్ -2 హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇక ఈయన చివరిగా చేసిన సినిమా ఒకే ఒక జీవితం, మనమే.అయితే గత ఏడాది జనవరిలో రక్షిత రెడ్డి అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న శర్వానంద్ అదే ఏడాది జూన్లో ఆమెని పెళ్లి చేసుకున్నారు. (Sharwanand)

Also Read: Bigg Boss: బిగ్ బాస్ హౌస్ లో దారుణం.. అర్ధరాత్రి అందరూ పడుకున్నాక భార్యతో ..?

ప్రస్తుతం వీరికి ఒక పాప కూడా పుట్టింది.అయితే అలాంటి శర్వానంద్ అప్పట్లో ఓ సింగర్ ని ప్రేమించాడట. ఆ సింగర్ కేవలం పాటలు మాత్రమే కాదు కొన్ని సినిమాల్లో నెగిటివ్ రోల్స్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక అప్పట్లో శర్వానంద్ ఆ సింగర్ ని ఓ ఈవెంట్లో కలిశారు. అలా ఇద్దరు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాక ప్రతిరోజు మాట్లాడుకునేసరికి ఇద్దరి మధ్య బాండింగ్ పెరిగిందట.దాంతో ఆ సింగర్ ని శర్వానంద్ పెళ్లి చేసుకోవాలి అనుకున్నారట..ఇక ఈ పెళ్లికి శర్వా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోలేదు.

 Did Sharwanand really love that singer

అయినప్పటికి శర్వానంద్ ఆ సింగర్ని మర్చిపోలేదట. ఆ సమయంలో ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్లు విషయంలో కల్పించుకొని శర్వానంద్ ని మందలించి ఆ సింగర్ కి కూడా అర్థమయ్యేలా చెప్పారట.. అలా వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని, ఆ తర్వాత శర్వానంద్ సినిమాలో బిజీ అవ్వడం ఆ సింగర్ తో కూడా బంధాన్ని బ్రేక్ చేసుకున్నాడంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ రూమర్ చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత కొద్ది రోజులకు రక్షిత రెడ్డి అనే అమ్మాయి పరిచయం అవ్వడం ఆమెను పెళ్లి చేసుకోవడం అలా అన్ని జరిగి పోయాయి.(Sharwanand)