Roja: రోజా గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకొని…. రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. వైసీపీ పార్టీలో రెండుసార్లు మంత్రిగా గెలిచి విజయాన్ని అందుకుంది. ఇక నగరి ఎమ్మెల్యేగా మొన్నసారి ఓటమిపాలైంది. Roja

Ex-minister Roja gestures to sanitation workers to keep distance for selfie

ఇదిలా ఉండగా…. రోజా పారిశుద్ధ్య కార్మికులను దూరంగా ఉండి ఫోటోలు దిగమని చేతితో సైగలు చేసినటువంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. తమిళనాడులోని ఓ ఆలయానికి రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. అక్కడ దేవుడిని దర్శించుకున్న అనంతరం బయటికి వస్తున్న సమయంలో అక్కడి ఉన్నవారు రోజాతో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. పారిశుధ్య కార్మికులైన ఇద్దరు మహిళలు రోజాతో సెల్ఫీలు తీసుకోవడానికి అక్కడికి వచ్చారు. Roja

Also Read: Jagan: జగన్ కు ఎదురుదెబ్బ… TDPలోకి వైసీపీ ఎంపీలు ?

అలా వారు రోజాని చూసిన సంతోషంలో తన దగ్గరికి వస్తుండగా…. రోజా వారిని చూసి అక్కడే ఉండి ఫోటో దిగండి అని చేతులతో సైగ చేసింది. ఈ వీడియో చూసిన అనంతరం రోజాకు మళ్ళీ నెగిటివ్ టాక్ వస్తోంది. ఇప్పటికే రోజాకు అన్ని వైపులా నుంచి వ్యతిరేకత వస్తోంది. Roja

ఇక తాజాగా ఈ వీడియోతో మరోసారి రోజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక రోజా ఇన్ని రోజులు మంత్రిగా బిజీగా ఉన్న కారణంగా సినిమాలకు…. షోలకు దూరంగా ఉంది. మరి ఇప్పుడు మంత్రిగా ఓడిపోయిన అనంతరం మళ్లీ సినిమాల్లోకి…. షోలకి రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. మళ్లీ రోజా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇండస్ట్రీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. Roja