Mahesh Babu second marriage.. Wedding card going viral

Mahesh Babu: మహేష్ బాబు నిజంగానే రెండో పెళ్లి చేసుకోబోతున్నారా.. ఇదే నిజమైతే నమ్రత పరిస్థితి ఏం గానూ.. అంత అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోతున్నారు.. మహేష్ బాబు రెండో పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి.. తమకు పుట్టిన కూతురు, కొడుకు ఎటు పోవాలి. అసలు మహేష్ బాబు నిర్ణయం వెనుక కారణం ఏంటి అంటూ చాలామంది ఈ వార్త విని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. మరి నిజంగానే మహేష్ బాబు రెండో పెళ్లి చేసుకోబోతున్నారా.. సోషల్ మీడియాలో మహేష్ బాబు రెండో పెళ్లి అంటూ వైరలవుతున్న పెళ్లి కార్డులో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం..

Mahesh Babu second marriage.. Wedding card going viral

మహేష్ బాబు రెండో పెళ్లి అనేది నిజమే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే..అలాగే వైరల్ అవుతున్న పెళ్లి కార్డు కూడా ఒక సినిమాకి సంబంధించింది.మరి ఇంతకీ ఆ పెళ్లి కార్డు ఏంటి..దాని వెనుక ఉన్న అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు1975 ఆగస్టు 9న జన్మించారు.అయితే ఈ మధ్యకాలంలో హీరోల బర్త్డే రోజు వారికి సంబంధించిన హిట్ సినిమాలు రీ రిలీజ్ చేసే ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది.ఈ నేపథ్యంలోనే ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలో రీ రిలీజ్ అయ్యాయి.ఇక మహేష్ బాబు బర్త్డే రోజు ఆయన నటించిన మురారి మూవీ ని రీ రిలీజ్ చేయాలి అని చిత్ర యూనిట్ భావిస్తోంది.(Mahesh Babu )

Also Read: Pavitra Gowda: రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న పవిత్ర గౌడ.. నిజంగానే ప్రెగ్నెంటా..?

ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు సోనాలి బింద్రేకి సంబంధించిన పెళ్లి కార్డు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీన్ని కొంత మంది వైరల్ చేస్తున్నారు ఇక ఆ పెళ్లి కార్డులో ఏముందంటే..వరుడు మురారి ఘట్టమనేని సత్యనారాయణ కనిష్ట కుమారుడు అని పెట్టారు. వధువు ప్లేస్లో చి.ల.సౌ వసుంధర చంటి అన్నపూర్ణ దంపతుల కనిష్ట కుమార్తెకు ఇచ్చి శ్రీ క్రోధి నామ సంవత్సరం శ్రావణ శుక్లపక్ష త్రయోదసినాడు అనగా 9-8-204 పూర్వాషాడ లగ్నమందు పెళ్లి చేయడం కోసం అభిమానులు నిర్ణయించారు.

Mahesh Babu second marriage.. Wedding card going viral

కావున బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ సతి సమేతంగా మీ అభిమాన థియేటర్లకు వచ్చి నూతన వధూవరుల సినిమాని పేపర్ ముక్కలతో ఆశీర్వదించగలరని కోరుతున్నాము అంటూ ఒక లగ్న పత్రికని రిలీజ్ చేశార.. దీంతో ఈ పెళ్లి కార్డు చూసిన చాలా మంది జనాలు మహేష్ అభిమానుల క్రియేటివిటీ వేరే లెవల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ఈ పెళ్లి కార్డు చూసిన జనాలు వెరైటీగా కామెంట్లు పెడుతున్నారు. ఇక మరి కొంతమందేమో మహేష్ బాబు సోనాలి బింద్రే ను పెళ్లి చేసుకుంటే నమ్రత పరిస్థితి ఏంటి అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.(Mahesh Babu )