Aarti Agarwal small mistake died reason

Aarti Agarwal: 16 ఏళ్లకే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగి వెండితెరపై సంచలనం సృష్టించింది హీరోయిన్ ఆర్తి అగర్వాల్. అందానికి అందం, అద్భుతమైన నటనతో తొలి సినిమా నుంచే ప్రేక్షకులను కట్టిపడేసింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఆర్తి సినీ ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పాలి. విక్టరీ వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో తెలుగు తెరపై కథానాయికగా అరంగేట్రం చేసింది ఆర్తి. తన మొదటి సినిమాతోనే బారీ విజయాన్ని అందుకున్న ఆర్తి అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీని కొన్ని సంవత్సరాలు శాసించింది. చిరంజీవి, నాగార్జున, తరుణ్, మహేష్ బాబు, ప్రభాస్, బాలకృష్ణ, రవితేజ వంటి స్టార్ హీరోలతో మాత్రమే కాదు మెగాస్టార్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది.

Aarti Agarwal small mistake died reason

హీరోయిన్‌గా ఆకట్టుకోవడమే కాకుండా.. విలన్‌గా కూడా చేసి అన్ని రకాలుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిన్న వయసులోనే స్టార్ అయిపోయిన ఈ హీరోయిన్.. వ్యక్తిగత జీవితం మాత్రం అంత సాఫీగా సాగలేదు. అతని కెరీర్ బాగానే సాగుతున్న సమయంలో ప్రేమ, పెళ్లి, బ్రేకప్ గురించి కూడా చాలా పుకార్లు వస్తున్నాయి. 2005లో మానసిక ఒత్తిడి కారణంగా అమె క్లీనింగ్ కెమికల్స్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఒక సంవత్సరం తరువాత, ఆమె మెట్లపై నుండి పడిపోయింది. 2007లో, ఆమె న్యూజెర్సీకి చెందిన ఉజ్వల్ నికమ్‌ని వివాహం చేసుకుంది. అయితే వారు వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు.

Also Read: Kanchi Kaul సంపంగి హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో చూడండి?

అప్పటికీ సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అప్పటికే ఆమె బరువు ఎక్కువగా ఉండడంతో అవకాశాలు తగ్గిపోయాయి. బరువు తగ్గాలనే చిన్న నిర్ణయం ఆమె ప్రాణాలను తీసింది. ఊబకాయం మరియు బరువు సమస్యలతో బాధపడుతున్న ఆర్తి, జూన్ 4, 2015న యునైటెడ్ స్టేట్స్‌లోని అట్లాంటిక్ సిటీలో లిపోసక్షన్ సర్జరీ చేయించుకుంది. కానీ ఆపరేషన్ విఫలమై గుండెపోటుతో మరణించింది. ఎన్ని సంవత్సరాలు గడిచిన ఆమె రూపం మాత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది.