Tamannaah Bhatia:  మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. ఓ వైపు వెబ్ సిరీస్ లు, సినిమాలు, ఇంకోవైపు యాడ్ షూట్ లు అంటూ తెగ బిజీగా ఉంటోంది. ఇటీవ‌ల “అరుమ‌నై 4” సినిమా ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా లో తమన్నా నటన కు అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పటికే పలు సినిమాల్లో ప్రత్యేక పాటలలో ఆడి పాడి అలరించిన తమన్నా తాజాగా కోలీవుడ్‌లోని ప్రముఖ నటుడు పార్తీబన్ చేసే సినిమా లో కూడా తమన్నా ఐటెం సాంగ్ చేయబోతున్నట్లు ఆసక్తికరమైన వార్తలు బయటకి వచ్చాయి. తమన్నా డ్యాన్స్ చేస్తే చాలు అన్నట్లు పార్తిబన్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పడం తో ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు నెటిజన్లు అతని వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు.

Actor Parthiban Comments on Tamannaah Bhatia

తమన్నా లాంటి హీరోయిన్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తో ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పార్తీబన్ కూడా స్పందించాడు. తమన్నాకి తనవైపు నుంచి క్షమాపణలు కూడా చెప్పాడు. సినీ పరిశ్రమలోని వారందరినీ తాను గౌరవిస్తానని అన్నారు. నటీనటులను కించపరచడం తన ఉద్దేశ్యం కాదు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. పార్తీబన్ తెలుగు, తమిళ చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించారు. సూపర్‌పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ రచ్చ సినిమా లో ఓ కీలక పాత్ర పోషించారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాల్లో నటించి మంచి నటుడిగా ఎదిగాడు.

Also Read: Kanchi Kaul సంపంగి హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో చూడండి?

ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన అడ్వెంచర్ థ్రిల్లర్ “టింజ్” జూలై 12న విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అయితే, ఈ సినిమా విజయోత్సవ వేడుకలకు హాజరైన పార్తిబన్ కొన్ని చిత్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ తమన్నా గురించి అన్నాడు. మరి అయన చెప్పిన సారీ తో అందరూ శాంతిస్తారా లేదా అనేది చూడాలి. నటుడిగా ఉన్నప్పుడు ఎవరి గురించి పడితే వారి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు అనేది నెటిజెన్ లు చెప్పే మాట.