Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… ప్రస్తుత రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. వైసీపీ కార్యకర్త రషీద్..సంఘటన అనంతరం… జగన్మోహన్ రెడ్డి మళ్ళీ యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ… జనాల ముందుకు వచ్చారు. ఇక సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో… చంద్రబాబు ప్రభుత్వ తీరును… ఢిల్లీలో ఎండగట్టాలనే నేపథ్యంతో… ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. Jagan

Big shock for Jagan YV Subbareddy distanced from YCP

జాతీయస్థాయిలో చంద్రబాబుకు షాక్ ఇచ్చేలా..ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం అత్యవసరంగా.. పార్లమెంట్ అలాగే రాజ్యసభ సభ్యులను… తాడేపల్లి ఆఫీస్కు పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే.. ఈ సమావేశం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి కేవలం…. లోక్సభ సభ్యులు నలుగురు అలాగే ఆరుగురు రాజ్యసభ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. Jagan

Also Read: Jagan: వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి బహిష్కరణ ?

వైసిపి పార్టీకి రాజ్యసభ సభ్యులు మొత్తం 11 మంది ఉన్నారు. కానీ హాజరైంది మాత్రం ఆరుగురు మాత్రమే. మొన్న గెలిచిన లోక్సభ.. ఎంపీలు నలుగురు కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. అయితే రాజ్యసభ సభ్యులలో… వై వి సుబ్బారెడ్డి, మోపిదేవి వెంకటరమణ అలాగే పరిమల్ సత్వాని.. హాజరు కాలేకపోయారు. Jagan

అయితే ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి హాజరు కాకపోవడం… ఇప్పుడు చర్చనీయాంశమైంది. వైసిపి పార్లమెంటరీ సభ్యులు అయ్యుండి… వై వి సుబ్బారెడ్డి హాజరు కాకపోవడం వివాదంగా మారింది.అయితే ఎల్లో మీడియాలో మాత్రం.. వైసిపి పార్టీకి వైవి సుబ్బారెడ్డి.. దూరం కాబోతున్నారని.. అందుకే ఆయన రాలేకపోయారని ప్రచారం చేస్తున్నారు. Jagan