Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల రోజుల కిందట చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయిన సంగతి అందరికీ తెలిసిందే.గత నెల రోజులుగా ఏపీలో… అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం… ఏపీ ప్రజలకు మంచి పాలన అందించే దిశగా అడుగులు వేస్తోంది. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా… ఇక్కడ తగ్గడం లేదు చంద్రబాబు ప్రభుత్వం. Chandrababu

TDP MLA rebellion against CM Chandrababu

కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పే అవకాశం ఉన్న నేపథ్యంలో.. నిధులను కూడా ఎక్కువగా తెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం పై తిరుగుబాటు చేశారు టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా కొలికపూడి శ్రీనివాసరావు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోని అసెంబ్లీలో ఎమ్మెల్యేగా తొలిసారి అడుగుపెట్టారు శ్రీనివాసరావు. Chandrababu

Also Read: Jagan: జగన్ కు బిగ్ షాక్… వైసీపీకి వైవీ సుబ్బారెడ్డి దూరం ?

అయితే ముందు నుంచి దూకుడుగా ఉండే శ్రీనివాసరావు… చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తన నియోజకవర్గం తిరువూరు లో భారీ వర్షాలు కురిసాయి. ప్రభుత్వ కార్యాలయం ముందు… గుంతలు బాగా ఏర్పడ్డాయి. అయితే ఆ గుంతలను చూసి ఉండలేక… బురదలో కుర్చీ వేసుకొని మరీ కూర్చున్నారు శ్రీనివాసరావు. Chandrababu

దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. వెంటనే రోడ్లు వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. నిరసన తెలిపారు కొలికపూడి శ్రీనివాసరావు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం పై.. టిడిపి ఎమ్మెల్యే శ్రీనివాసరావు తిరుగుబాటు చేశారని వైసిపి… సెటైర్లు పెంచుతుంది. అటు మొన్న.. వైసీపీ నేత ఇల్లు కూల్చేసిన సంఘటనలో శ్రీనివాసరావు పై కేసు కూడా పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. Chandrababu