Avika Gor secretly married her boyfriend

Avika Gor: చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ ద్వారా బుల్లితెరపై ఎంతో క్రేజ్ సంపాదించుకున్న అవికా గోర్ బాలీవుడ్ లో రెండు మూడు సినిమాల్లో నటించి తెలుగులో విరంచి వర్మ దర్శకత్వంలో వచ్చిన ఉయ్యాల జంపాల మూవీ ద్వారా స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. ఈ సినిమాకి నాగార్జున, రామ్మోహన్ నిర్మాతలుగా చేశారు. అయితే అలాంటి అవికా గోర్ నిజంగానే బాయ్ ఫ్రెండ్ ని రహస్యంగా పెళ్లి చేసుకుందా.. ఇంతకీ ఆమె ప్రేమించిన అబ్బాయి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..

Avika Gor secretly married her boyfriend

అవికా గోర్ ఉయ్యాల జంపాల సినిమాతో మంచి హిట్ కొట్టడంతో వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలా ఎక్కడికి పోతావు చిన్నవాడా, టెన్త్ క్లాస్ డైరీస్, సినిమా చూపిస్త మావా,బ్రో, లక్ష్మీ రావే మా ఇంటికి, థాంక్యూ వంటి సినిమాల్లో నటించింది.అలాగే వధువు, మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ లలో కూడా ఈ ముద్దుగుమ్మ చేసింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ గురించి ఓ సంచలన విషయం చెప్పింది. (Avika Gor)

Also Read: Hebah Patel: పెళ్లికి రెడీ అయిన హెబ్బా పటేల్.. హల్దీ ఫొటోస్ వైరల్..?

అయితే ఈ విషయం తెలిసిన చాలామంది జనాలు అవికా గోర్ రహస్యంగా పెళ్లి చేసుకుందా ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. అవికా గోర్ తన ప్రియుడి గురించి మాట్లాడుతూ.. నేను నా బాయ్ ఫ్రెండ్ తో ఆరు నెలలు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేశాను. ఆయన నాకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిశారు.ఆ తర్వాతే మీలంద్ చాంద్వానీ నాకు ప్రపోజ్ చేశారు. ఇక ఇద్దరి మనసులు ఒక్కటవ్వడంతో చాలా రోజుల నుండి డేటింగ్ చేస్తున్నాం. అయితే పెళ్లి చేసుకోక పోయినప్పటికీ మాకు మానసికంగా ఎప్పుడో పెళ్లి అయిపోయినట్టే.

Avika Gor secretly married her boyfriend

ఇక పెళ్లి గురించి చాలా ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే మీలంద్ నాకంటే వయసులో పెద్దవాడు కాబట్టి వెళ్లి తర్వాత ఎలాంటి ప్రాబ్లంస్ రాకుండా ముందుగానే అన్ని చర్చించుకుంటున్నాం.అలాగే పెళ్లి అనేది పెద్ద విషయం కాబట్టి దాని గురించి అన్ని విధాలా చర్చించాలి అని ప్రతిసారి నాతో మీలంద్ నాతో చెప్తూ ఉంటారు అంటూ అవికా గోర్ చెప్పుకొచ్చింది. ఇక అవికా గోర్ మాటలు విన్న చాలా మంది జనాలు అవికా గోర్ రహస్యంగా పెళ్లి చేసుకుంది కావచ్చు. అందుకే మాకు మానసికంగా ఎప్పుడో పెళ్లయిపోయింది అని చెబుతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.(Avika Gor)