balakrishna craze increase with mass movies

Balakrishna: నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటూ ఆయన క్రేజ్ ను రోజురోజుకు పెంచుతు పోతున్నాయి. ఆయన చేసిన సినిమాలను పరిశీలిస్తే భారీ స్థాయిలో కలెక్షన్లను తీసుకురావడం మంచి యాక్షన్ మూవీస్ కావడం ఆయనకు ఆయన క్రేజ్ కు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం ఆయన మాస్ చిత్రాల దర్శకుడైన బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ ఉండగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శవేగంగా జరుపుకుంటుంది.

balakrishna craze increase with mass movies

తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కంటే ముందు బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా 100 కోట్ల గ్రాస్ ను అందుకోవటం అమెరికా. కెనడా వంటి విదేశాల్లో ఆయన సినిమాకు ప్రేక్షకులు విపరీతంగా ప్రేక్షకులు తరలిరావడం వంటివి చూస్తుంటే బాలకృష్ణకు మంచి క్రేజ్ పెరిగింది అని చెప్పాలి. ఒకప్పుడు హిట్టు కోసం నానా తంటాలు పడిన బాలయ్య ఇప్పుడు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. ఆయన నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తూ ఉంటే ప్రస్తుతం ఆయన సెలెక్టెడ్ సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.

Also Read: Double Ismart: అవుట్ డేటెడ్ పూరీ.. డబుల్ ఇస్మార్ట్ లో క్లియర్ గా తెలుస్తుంది!!

ఏదేమైనా ఈ వయసులో కూడా బాలకృష్ణ యాక్షన్ మసాలా సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ముఖ్యంగా తన అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాడు.ఇతర టాలీవుడ్ సీనియర్ హీరోలతో పోలిస్తే బాలకృష్ణ రేంజ్ మునుపటికంటే చాలా మారిందని చెప్పాలి. చిరంజీవి నాగార్జున వెంకటేష్ వంటి హీరోలు ఎన్ని సినిమాలు చేసిన కూడా హిట్లు దక్కక పోతుంటే బాలకృష్ణ మాత్రం ఇలా సినిమాలు చేసి అలా హిట్లు కొడుతూ ఉండడం ఆయన అభిమానులను ఎంతగానో సంతోష పరుస్తుంది.

ఇప్పుడు చేస్తున్న సినిమా తర్వాత కూడా బాలకృష్ణ చేతిలో మంచి మంచి సినిమాలే ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి ఏదేమైనా ఈ వయసులో బాలకృష్ణ ప్రేక్షకులను ఈ స్థాయిలో అలరించడం విశేషం. మరి భవిష్యత్తులో ఆయన ఇంకెలాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి.