Dhanush Says Pawan Kalyan is his Favorite Telugu Actor

Raayan: తెలుగు నాట తమిళ హీరోలకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా కొంతమంది తమిళ హీరోలకు తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. తెలుగు హీరోల కు సమానంగా వారి సినిమాలకు ఓపెనింగ్స్ అందిస్తూ ఉన్నారు. అలాంటి వారిలో ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో ధనుష్. మొదట్లో తెలుగులో తన సినిమాలను విడుదల చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు ధనుష్. కానీ ఎప్పుడైతే పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయిందో అప్పటినుంచి ధనుష్ మాత్రమే కాదు ప్రతి ఒక్క తమిళ్ హీరో కూడా తెలుగులో తమ సినిమాలను విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.

Dhanush Says Pawan Kalyan is his Favorite Telugu Actor

అలా పలు సినిమాలతో హీరో ధనుష్ ఇప్పటికే ప్రేక్షకులకు బాగా దగ్గరయి మంచి మార్కెట్ను ఏర్పరచుకోగా ప్రస్తుతం ఆయన రాయన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలుగులో ఈ హీరోకి మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యేందుకు ఆయన ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఈనెల 26వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతూ ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర బృందం శరవేగంగా మొదలుపెట్టింది.

Also Read: Allu Arjun Vs Ram Charan: అదే జరిగితే.. బావ బామ్మర్దుల మధ్య భారీ యుద్ధమే!!

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా ఈవెంట్లో తెలుగులో ధనుష్ కు ఇష్టమైన హీరో ఎవరు అని అడగగా పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఆయన అభిమానుల మనసులను దోచుకున్నాడు. పవన్ కళ్యాణ్ పేరు చెప్పి చాలామంది హీరోలు తమ సినిమాలకు మంచి మంచి కలెక్షన్లు వచ్చేలా చేసుకుంటా ఉంటారు.అది ఇప్పటివరకు చిన్న హీరోలు మాత్రమే చేశారు ఇప్పుడు ధనుష్ లాంటి పెద్ద హీరోలు కూడా ఆయన పేరును వాడుకోవడం నిజంగా అందరిని ఆశ్చర్యపరిచేదే.

వరుసగా తెలుగులో మంచి మంచి సినిమాలు చేస్తూ ఇక్కడ అభిమానుల మనసులో పాతుకుపోతున్న ధనుష్ ఇప్పుడు పవన్ భజన చేయడం ఆయన సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. వెరైటీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా యొక్క ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోగా ఈ చిత్రంలో తెలుగు నటుడు సందీప్ కిషన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు అంతేకాదు తమిళంలో దర్శకుడుగా మంచి పేరు సంపాదించుకుని ఇప్పుడు నటుడిగా స్థిరపడ్డ ఎస్ జే సూర్య కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు.