Heroine Meenakshi Choudhary is Next Big Heroine

Heroine: తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిన్ లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఆ విధంగా ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్లు ప్రేక్షకులను అలరించగా ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత బాగానే ఉందని చెప్పాలి. శ్రీ లీల తప్ప మరొక టాప్ హీరోయిన్ కనిపించడం లేదు మేకర్స్ కి. అంతకుముందు పూజా హెగ్డే టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు టాప్ హీరోయిన్ గా ఉండేది. ఆ తర్వాత శ్రీలీలనే అందరికీ ఆప్షన్ అయిపోయింది. ఇప్పుడు ఆమె కూడా పెద్దగా ఎవరికి నచ్చడం లేదు. దాంతో ఇప్పుడు ఆ స్థానం ఖాళీగా ఉందని చెప్పాలి. తాజాగా ఓ ముద్దుగుమ్మ పేరు ఎక్కువగా సినిమాల్లో వినిపిస్తుంది. ఆమె ఎవరో కాదు మీనాక్షి చౌదరి.

Heroine Meenakshi Choudhary is Next Big Heroine

ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ స్లోగా తన ప్రభంజనాన్ని మొదలు పెట్టింది అని చెప్పాలి. మొదటి సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా కూడా ఆమె నటన అందం అందరినీ ఆకట్టుకుంది. ఆ విధంగా హిట్2 సినిమాలో ఆమె ఎంపికయి ఆ చిత్రంతో సక్సెస్ అందుకుంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా లో కూడా ఓ గ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగుతో పాటు తమిళంలో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి. అక్కడ విజయ్ దళపతి జోడిగా గోట్ అనే సినిమాలో నటిస్తుంది.

Also Read: Ram Charan: రామ్ చరణ్ స్వయంకృతపరాధం.. సర్వ నాశనం!!

పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండగా సెప్టెంబర్ 5న విడుదల కాబోతుంది. ఇక దుల్కర్ సల్మాన్ జోడిగా లక్కీ భాస్కర్ మూవీలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ విశ్వంభర సినిమాలో మీనాక్షి ఓ కీలక పాత్ర లో నటిస్తుంది. ఇక విశ్వక్ సేన్ జోడీగా కూడా నటిస్తుంది. ఇక వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబో లో కూడా ఈమె హీరోయిన్ గా ఖరారు అయిందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ ‘మట్కా’ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఓవరాల్ గా 6 సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అందులో నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్టులు కావడం విశేషం. వీటిలో సగం హిట్ అయినా కూడా మీనాక్షి ఇమేజ్ భారీగా పెరిగిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా హీరోలకు మరొక ఆప్షన్ లేని నేపథ్యంలో మీనాక్షి చౌదరికి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని అంటున్నారు. మరి ఆమె ఈ అవకాశాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.