Raj Tarun lover Lavanya has a three-year-old daughter

Raj Tarun: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో ఎన్ని వార్తలు వైరల్ అవుతున్నాయో చెప్పనక్కర్లేదు. ఆయన లవర్ లావణ్య హీరోయిన్ మాల్వీ మల్హోత్రా వల్ల ప్రాణభయం ఉంది అంటూ కేసు పెట్టడంతో వీరికి సంబంధించిన ఎన్నో విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో లావణ్యకి మూడు సంవత్సరాల పాప ఉంది అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది.మరి నిజంగానే లావణ్య కి మూడు సంవత్సరాల పాప ఉందా..ఆ పాప ఎవరి పాప అనేది ఇప్పుడు చూద్దాం..

Raj Tarun lover Lavanya has a three-year-old daughter

రాజ్ తరుణ్, లావణ్య ల గురించి ఇప్పటికే ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది లావణ్య కు సంబంధించిన వాళ్ళను మరికొంతమంది రాజ్ తరుణ్ కి సంబంధించిన వాళ్లను పిలిపించుకొని మరీ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా దాసరి విజ్ఞాన్ ని సీనియర్ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేయగా తప్పంతా లావణ్యదేనని చెప్పేసాడు.లావణ్య కావాలనే రాజ్ తరుణ్ ని టార్చర్ చేస్తుందని,ఒక దాని తర్వాత మరొకటి బయటపెడుతూ ఆయన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని చెప్పారు. (Raj Tarun)

Also Read: Sr.NTR: సీనియర్ ఎన్టీఆర్ రెండో పెళ్లి కి కారణం ఆ హీరో భార్యనేనా..?

అంతేకాదు ఓ రెండు రోజులు మాల్వి మల్హోత్రా గురించి మరో రెండు రోజులు అబార్షన్ గురించి ఇంకో రెండు రోజులు ఆత్మహత్య చేసుకుంటా అంటూ ఇలా రోజు రోజుకి కొత్త కొత్త విషయాలను బయటకు తీస్తుంది.ఈ విషయంలో లావణ్య వల్ల ఇబ్బందులకు గురవుతున్న రాజ్ తరుణ్ నేను ఆమెతో వేగలేను అని చెప్పేసి ఆమెకు దూరంగా ఉంటున్నాడు.దాంతో ఆయనకు మాల్వీ మల్హోత్రా దగ్గరయ్యింది.

Raj Tarun lover Lavanya has a three-year-old daughter

కానీ వీరిద్దరి బంధాన్ని కూడా ఆమె తప్పు పడుతుంది. ఆమె వేరే వ్యక్తి దగ్గరికి వెళ్తే ఎలాంటి తప్పులేదు కానీ రాజ్ తరుణ్ మరో అమ్మాయిని చూసుకుంటే తప్పు వచ్చిందా.. ఇదెక్కడి న్యాయం అంటూ చెప్పుకొచ్చారు. అలాగే లావణ్యకి రాజ్ తరుణ్ వల్ల మూడేళ్ల పాప కూడా పుట్టింది అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని ఆయన రూమర్స్ ని కొట్టి పారేశారు..(Raj Tarun)