Ram Charan Next Movies Dissappointed

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరంజీవి వారసుడుగా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. తన నటనతో డాన్సులతో కోట్లాదిమంది అభిమానులను మూటకట్టుకున్న రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రేక్షకులను దేశవ్యాప్తంగా అలరించి ఇప్పుడు మరొక భారీ సినిమా తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. తమిళనాడులో పెద్ద గొప్ప దర్శకుడుగా పేరున్న శంకర్ రామ్ చరణ్ తో కలిసి గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Ram Charan Next Movies Dissappointed

ఈ సినిమాను ఎప్పుడో మొదలు పెట్టినప్పటికీ పలు అనివార్య కారణాలవల్ల శంకర్ ఈ చిత్రాన్ని ఇప్పటికీ పూర్తి చేయలేకపోయాడు. ఆయన గత సినిమా భారతీయుడు 2 సినిమా ఆగిపోవడంతో ఆ సినిమా పనులన్నీ పూర్తి చేసి గానీ ఈ సినిమాకు వచ్చే వీలు లేకపోవడంతో ఆయన గేమ్ ఛేంజర్ పని ఇప్పుడు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత భారతీయుడు 3 సినిమాను కూడా ఆయన చేయవలసి ఉంది. ఆ విధంగా ఈ మూడు సినిమాలను ఒకేసారి చేస్తూ ఆలోచిస్తూ సినిమాలు చేయడం జరిగింది శంకర్.

Also Read: Balakrishna: బాలయ్య కి ఊహించని డిమాండ్.. ఈ వయసులో కూడా!!

ఏదేమైనా శంకర్ రామ్ చరణ్ ఫ్యాన్ ఇండియా కెరియర్ను ప్రమాదంలో నెట్టివేసినట్లే అని చెప్పాలి. ఎందుకంటే శంకర్ గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోతున్నాడు. ఆయన చేస్తున్న భారీ సినిమాలను కూడా బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి. ఆ విధంగా ఇప్పుడు అందరి దృష్టి గేమ్ ఛేంజర్ సినిమా పైనే ఉంది. శంకర్ భవిష్యత్తు తేలాలన్నా రామ్ చరణ్ భవిష్యత్తు నిలవాలన్న ఈ సినిమా ఫలితం పైన ఆధారపడి ఉంది. కానీ ఇన్సైడ్ ప్రకారం ఈ సినిమా ఏమంత గొప్పగా లేదని చెబుతున్నారు దానికి తోడు ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేయడం అందులోనూ పుష్పాలాంటి భారీ సినిమా విడుదలకు ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది చాలామంది మెగా అభిమానుల ఆలోచన.

ఏదేమైనా రాంచరణ్ ఆర్ ఆర్ ఆర్ లాంటి గొప్ప సినిమా తరువాత చేయవలసిన సినిమాలను సరిగ్గా నిర్ణయించుకోలేదనేది కొంతమంది సినిమా విశ్లేషకుల మాట. శంకర్ లాంటి ఫ్లాప్ దర్శకుడు తో సినిమాను ఒప్పుకోవడం ఒక తప్పైతే ఒక చిన్న సినిమాతో హిట్టు కోట్టిన మరొక దర్శకుడుతో సినిమా చేయడం కూడా చరణ్ చేస్తున్న మరొక మిస్టేక్ అని అంటున్నారు ఎందుకంటే ఆయన తోటి హీరోలు పెద్ద దర్శకులతో భారీ స్కేల్లో సినిమాలు చేస్తుంటే రామ్ చరణ్ మాత్రం చిన్న దర్శకులతో సినిమాల చేయడం ఆయన అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. మరి చరణ్ చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.