Suman sensational Comments on Kamal Haasan

Suman: స్టార్ హీరోగా ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ,వెంకటేష్, మోహన్ బాబు వంటి హీరోలతో పోటీపడి మరీ సినిమాలు చేశారు సుమన్.అయితే అలాంటి సుమన్ ఒక్కసారి జైల్లోకి వెళ్లి వచ్చాక ఆయన జీవితం మొత్తం తలకిందులు అయిపోయింది. అవకాశాలు రాక చాలా ఇబ్బందులు పడ్డారు.ఇక చివరికి విలన్ పాత్రల్లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయవలసి వచ్చింది. ఇక స్టార్ హీరో అవ్వాల్సిన సుమన్ ని కొంతమంది ఇండస్ట్రీలో వాళ్ళు తొక్కేశారు అనే టాక్ కూడా ఉంది. అయితే అలాంటి సుమన్ సినిమాల్లో హీరోగా పాత్రలు చేయకపోయినప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతూ అంది వచ్చిన పాత్రలు చేస్తూ వస్తున్నారు.

Suman sensational Comments on Kamal Haasan

ఇక సుమన్ కేవలం సినిమాల్లోనే కాదు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పడంలో కూడా ఫస్టే ఉంటారు.అయితే ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ గురించి ఆయన కూతురు గురించి సంచలన కామెంట్స్ చేసి ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. కమల్ హాసన్ కూతురితో కూడా రొమాన్స్ చేయగలడు అని చెప్పిన సుమన్ మాటలు కాస్త వివాదాస్పదమయ్యాయి. అయితే సుమన్ కేవలం సినిమాల పరంగా మాత్రమే మాట్లాడారు.అసలు విషయం ఏమిటంటే.. (Suman)

Also Read: Hebah Patel: పెళ్లికి రెడీ అయిన హెబ్బా పటేల్.. హల్దీ ఫొటోస్ వైరల్..?

సుమన్ కమల్ హాసన్ గురించి మాట్లాడుతూ..కమల్ హాసన్ మంచి రొమాంటిక్ హీరో.ఆయన ఎలాంటి పాత్రలో నైనా అలవోకగా నటించగలరు. ఆయన సినిమా కోసం గుండు కూడా కొట్టించుకున్నాడు. అలాంటి హీరో నుండి ఇప్పటి జనరేషన్ హీరోలు చాలా నేర్చుకోవచ్చు. అలాగే డీ గ్లామరస్ పాత్రల్లో కూడా కమల్ హాసన్ నటించగల హీరో. కానీ ఇలాంటి పాత్రల్లో నాలాంటి హీరోలు మాత్రం నటించడానికి అస్సలు ముందుకు రారు.

Suman sensational Comments on Kamal Haasan

ఇక ఆయన ఒక పాత్రలో ఎంతగా మునిగిపోతారు అంటే ఆ పాత్రలో కూతురితో రొమాన్స్ చేయవలసి వచ్చినా కూడా రొమాన్స్ చేస్తారు.అలాంటి హీరో అంటూ సుమన్ కమల్ హాసన్ సినిమాల గురించి ఆయన యాక్టింగ్ గురించి చెప్పుకొచ్చారు. అయితే సుమన్ మాట్లాడిన కూతురితో కూడా కమల్ రొమాన్స్ చేయగలడు అనే మాటని కొంతమంది కమల్ హాసన్ అభిమానులు తీసుకోలేకపోతున్నారు. అయితే సుమన్ కమల్ హాసన్ గురించి నెగటివ్ గా మాట్లాడలేదు. ఆయన సినిమాల్లో లీనమైపోయి చేస్తారు అనే మాట్లాడారు.(Suman)