Anjali about her role in Bahishkarana Series

Anjali: సినిమా అన్నాక ఎలాంటి పాత్రనైనా చేయాలి. సినిమా కోసం సినిమాలోని పాత్రల కోసం ఇప్పటివరకు చాలామంది నటీనటులు ఎన్నో వర్క్ షాప్ లు చేసి మరీ ఆ పాత్రలను విజయవంతంగా పోషించి వాటికి ప్రాణం పోశారు. ఇటు హీరోయిన్లు ఇప్పటివరకు తమ అందాలను దాచుకోకుండా ప్రేక్షకులను కనువిందు చేస్తూ సినిమాలు చేశారు. ఆ విధంగా ఓ వేశ్య పాత్ర కోసం కొన్ని ఇంటిమేట్ సీన్లను సెట్లో చేశాను అంటూ చెబుతుంది హీరోయిన్ అంజలి. షాపింగ్ మాల్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ తెలుగు అమ్మాయి తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

Anjali about her role in Bahishkarana Series

ఆ తర్వాత వరుస సినిమాల అవకాశాలు అందుకుని తెలుగులో హీరోయిన్ గా సెటిలైపోయిన అంజలి ఇటీవల విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రంలో ఆమె చేసిన పాత్రకు మొదట్లో విమర్శలు వచ్చినా కూడా తర్వాత తన యాక్టింగ్ తో వారందరి నోళ్లు ముగించింది. ఇప్పుడు బహిష్కరణ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు రాగా ఆ సిరీస్ లో ఆమె వేశ్య పాత్రలో కనిపించి ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంది. ఇందులో కొన్ని ఇంటిమేట్ సీన్లలో కూడా నటించింది. దీనిపై ఆమె ఇంటర్వ్యూలో చెబుతూ ఈ సీన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త పడ్డారని సెట్స్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బయటికి పంపి షూట్ చేశారని ఆమె చెప్పింది.

Also Read: Anushka: హ్యాండ్సమ్ అబ్బాయి తో పెళ్లికి రెడీ అయిన అనుష్క..?

ఇప్పటివరకు ఇలాంటి సీన్స్ ఎప్పుడూ చేయలేదని చాలా కొత్తగా అనిపించింది అని ఆమె చెప్పింది. సినిమాలో తాను చేసిన పాత్రకు న్యాయం చేశానా అని ఒకటే ఆలోచిస్తానని కూడా తెలిపింది. గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాలో తాను చేసిన పాత్రకు మంచి పేరు వచ్చింది అని చెప్పింది. ప్రతి మూవీకి కూడా మంచి హోంవర్క్ చేస్తానని ఆ రోజు కోసం కష్టపడతానని వెల్లడించింది. అంతేకాదు కొన్ని సినిమాల్లో ఆమె పాత్రకు డిమాండ్ చేసినందుకు నేర్చుకున్నట్లు వెల్లడించింది. కొన్ని గంటలపాటు వాష్ రూమ్ కి వెళ్లకుండా షూటింగులు చేసిన రోజులు ఉన్నాయని కూడా చెప్పింది. నవరస అనే ఓ సినిమా షూటింగ్ కోసం ఆమె ఆ విధంగా చేసింది.

ఆ విధంగా అంజలి నటిగా ప్రేక్షకులను ఎప్పటికీ అలరిస్తూనే వచ్చింది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీలో మరొకసారి ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం అందిస్తూ ఉండగా డిసెంబర్లో ఈ చిత్రం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ కు సతీమణిగా అంజలి కనిపించడం ఉందని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఈమె కనిపించబోతుందట.