Bigg Boss 8 with that hot beauty and 2 star heroines

Bigg Boss 8: బిగ్ బాస్ 8 అనే ప్రారంభం కాబోతోంది.ఈ సీజన్ కి సంబంధించి ఇప్పటికే మొదటి ప్రోమో అఫీషియల్ గా విడుదల చేయడంతో చాలామంది ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవరెవరు రాబోతున్నారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే బిగ్ బాస్ 4 నుండి కొనసాగుతున్న సెంటిమెంట్ ప్రకారం బిగ్ బాస్ 8 ని కూడా సెప్టెంబర్ నెలలోనే ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్టార్ మా లో కిరాక్ బాయ్స్ కి కిలేడీ గర్ల్స్ అనే షో వస్తుంది.

Bigg Boss 8 with that hot beauty and 2 star heroines

ఈ షో సెప్టెంబర్ 1 నాటికి పూర్తవుతుంది.ఇక సెప్టెంబర్ 8 ఆదివారం రోజున బిగ్ బాస్ 8 సీజన్ ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్స్ గా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు రాబోతున్నట్టు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ సీజన్ 8లోకి ఆ సీనియర్స్ హీరోయిన్స్ రాబోతున్నట్టు తెలుస్తోంది.(Bigg Boss 8)

Also Read: Samantha: చైతూని వదులుకొని టార్చర్ అనుభవిస్తున్న సమంత.. ఏం చేసిందంటే..?

వాళ్లేవరంటే తరుణ్ నువ్వే కావాలి మూవీ హీరోయిన్ రిచా, సింహాద్రి, లాహిరి లాహిరి లాహిరిలో అనే మూవీ హీరోయిన్ అంకిత కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ ఇద్దరు సీనియర్స్ మాత్రమే కాదు హాట్ బ్యూటీ పూనం బజ్వా కూడా ఈ రియాల్టీ షోలోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమే అయితే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు.అలాగే సీనియర్ హీరో రోహిత్ కూడా బిగ్ బాస్ 8 రియాల్టీ షో కి వచ్చి శివాజీ లాగా ఫేమస్ అవ్వాలని చూస్తున్నారట.

Bigg Boss 8 with that hot beauty and 2 star heroines

అలాగే ఆలీ సోదరుడు నటుడు ఖయ్యూం, రేఖ బోజ్, యాంకర్ రీతు చౌదరి,సింగర్ సాకేత్, మై విలేజ్ షో అనిల్ జీలా,పటాస్ యాదమ్మ రాజు, కమెడియన్ ప్రభాస్ శ్రీను వంటి సెలబ్రిటీలు బిగ్ బాస్ సీజన్ 8లోకి రాబోతున్నట్లు సమాచారం.కానీ వీరందరూ వస్తున్నారో లేదో అనే ఫుల్ క్లారిటీ మాత్రం లేదు. చివరి వరకు కూడా ఈ హౌస్ లోకి ఎవరు వస్తారు అనేది చెప్పడం కష్టం.(Bigg Boss 8)