Chiranjeevi movie with god father director mohan raja

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో కొనసార్లు ఎలా జరుగుతుంది అనుకుంటే ఒక దర్శకుడిని నమ్మి అవకాశం ఇస్తే హీరోలకు వారు మర్చిపోలేని ప్లాపులు అందిస్తూ ఉంటారు. కొన్నిసార్లు నమ్మకం లేని దర్శకులు హిట్లు ఇస్తూ ఉంటారు. ఆ విధంగా మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో ఎత్తు పళ్ళాలు చూశారు. ఎంతోమంది దర్శకులతో సినిమాలు చేశారు. ప్లాపులు ఇచ్చిన దర్శకులతో కూడా సినిమాలు చేసి వారితోనే హిట్టు కొట్టి ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కున్నారు. అలా తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఓ దర్శకుడు నమ్మి భారీ ప్రాజెక్టును అప్పగిస్తే అది ఆయనకు మరచిపోలేని చేదు అనుభవాన్ని మిగిలించింది.

Chiranjeevi movie with god father director mohan raja

అయితే మళ్లీ ఇప్పుడు ఆయనకు మళ్ళీ సినిమా అవకాశం ఇవ్వడం టాలీవుడ్ లో ప్రతి ఒక్కరు దీని గురించి చర్చించుకుంటున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ సినిమా లూసీఫర్ కు రీమేక్ గా తెలుగులో రూపొందిన గాడ్ ఫాదర్ చిత్రం ప్రతి ఒక్కరికి తెలిసిందే. సల్మాన్ ఖాన్ కూడా మరొక హీరోగా నటించిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో చతికిల పడిపోయింది. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే భారీ నష్టాన్ని చవిచూసిన ఈ సినిమా చిరు చెడ్డపేరును కూడా తీసుకొచ్చింది. అలాంటిది ఈ దర్శకుడు తో మరొక సినిమా చేయడానికి మెగాస్టార్ చిరంజీవి సన్నాహాలు చేస్తున్నాడు. పోనీ ఈ చిత్రానికి ఆయన కథ అందిస్తున్నారంటే కాదు తెలుగులో రచయితగా మంచి పేరున్న బీవీఎస్ రవి ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు.

Also Read: బిగ్ బాస్ 8 ఆ హాట్ బ్యూటీ తో పాటు 2 స్టార్ హీరోయిన్స్.. రచ్చ మాములుగా ఉండదు.!!

మెగాస్టార్ కూతురు సుష్మిక కొణిదల ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. వాస్తవంగా ఈ సినిమా పెళ్లయిన ఓ మధ్య వయసుకుడి పాత్ర చుట్టూ తిరుగుతుంది. చిరంజీవి ఆ పాత్రలో కనిపించబోతుండడం ఆయన కెరియర్లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అందరూ అంటున్నారు. వరుస కమర్షియల్ సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవికి ఇది ఓ మంచి సినిమా అయ్యే అవకాశం అని చెప్పాలి. ఇదే కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా చిరంజీవి ఓ సినిమాను చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హరీష్ శంకర్ సినిమా అంటే కమర్షియల్ లైన్లో ఉంటుంది కాబట్టి ఇలాంటి వెరైటీ కథను చేయడం మంచిదే అని అభిమానులు కూడా మెగాస్టార్ చిరంజీవిని కోరుతున్నారు. మరి మెగాస్టార్ చిరంజీవి ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ప్రస్తుతం చేస్తున్న విశ్వంభర సినిమా కూడా వేరే స్థాయి లో ఉండబోతుందని తెలుస్తుంది. గతంలో చిరంజీవి చేసిన అంజి సినిమాలాంటి స్థాయి లో ఈ సినిమా ఉండబోతుంది. కమర్షియల్ గా ఆడకపోయినా ఈ సినిమా తో చిరుకి మంచి పేరొచ్చింది.