Nayantara continuing films after marriage

Nayantara: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి తెలియని వారు ఉండరు. సౌత్ సినిమా పరిశ్రమలో ఏ హీరోయిన్ కూడా తెచ్చుకున్నటువంటి క్రేజ్ ను సంపాదించుకుంది. ఒక్కొక్కసారి ఆమె స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇచ్చి వారి సినిమాలకు ఏ స్థాయిలో అయితే కలెక్షన్లు వస్తాయో తాను నటించే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా అదే స్థాయిలో కలెక్షన్లు వచ్చేలా చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత కాస్త దూకుడు తగినట్టు అనిపించిన నయనతార మళ్ళీ తిరిగి ఫామ్ లోకి వచ్చి వరుస సినిమాలు చేస్తుంది.

Nayantara continuing films after marriage

ఇప్పటికే బాలీవుడ్ లో ఆమె చేసిన జవాన్ సినిమా మంచి విజయాన్ని అందుకోగా అక్కడ కూడా వరుస అవకాశాలు ఆమెకు వస్తున్నాయి. కానీ అక్కడ సినిమాల కంటే సౌత్ లో సినిమాలు చేయడానికి ఎక్కువగా నయనతార ఆసక్తి చూపిస్తున్నట్లుగా సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తుంది. పలు బాలీవుడ్ ప్రొడక్షన్స్ నుంచి ఆమెకు మంచి మంచి ఆఫర్లు వచ్చాయట. వాటన్నిటినీ కాలదన్ని, భారీ రెమ్యునరేషన్ వద్దనుకుని మరి తమిళంలో రెండు సినిమాలను చేసేందుకు సిద్ధమవుతుందట. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ పనులలో నిమగ్నమై ఉండగా తెలుగులో కూడా సినిమాలు చేసే విధంగా ఆమె భావిస్తుంది.

Also Read: Saif Ali Khan: ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటే నా బతుకేమైపోయేదో.?

ఒకవైపు భర్త పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే ఇంకొకవైపు కెరియర్ ను మునుపటిలా ముందుకు సాగించాలని ఆమె కోరుకుంటుంది. అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు ఎప్పటికప్పుడు వెరైటీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన నయనతార కమర్షియల్ సినిమాలలో సైతం నటిస్తూ హీరోల అభిమానులను ఎంతగానో అలరిస్తుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండుకు నయనతార ను హీరోయిన్ గా ఎంపిక చేయడం అనేది కరెక్టే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమెకు దేశవ్యాప్తంగా మంచి పేరు తో పాటు క్రేజ్ ఉన్న నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాల్లో ఆమెను హీరోయిన్ గా తీసుకుంటే తప్పకుండా హీరోలకు అటు నిర్మాతలకు బాగానే కలిసి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తుందో చూడాలి.