Raviteja Mister Bacchan Release on Aug 15

Raviteja: హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ షెరవేగంగా జరుగుతుంది. అతి తక్కువ సమయంలోనే ఈ సినిమాను చివరి స్టేజి వరకు తీసుకువచ్చారని చెప్పాలి. బాలీవుడ్ లో రూపొందిన రైడ్ సినిమాకి రీమేక్ గా తెలుగులో రాబోతున్న ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఏదేమైనా ఎంత తక్కువ సమయంలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకులు ముందుకు తీసుకురావడం నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. రవితేజ కూడా తన సినిమాకు పెద్దగా టైం తీసుకోడు.

Raviteja Mister Bachchan Release on Aug 15

ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ సినిమా కంటే ముందు హరిష్ శంకర్ చేయవలసిన ఓ సినిమా హోల్డ్ లోకి వెళ్లిపోవడం పట్ల ఆయన అభిమానులు ఎంతో నిరాశ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆగిపోయింది. అయితే తాజాగా హరీష్ శంకర్ ఇప్పటివరకు హిట్ లు అందుకున్న సినిమాలన్నీ కూడా రీమేక్ సినిమాలే కావడంతో ఓ నేటిజన్ క్వశ్చన్ అడిగాడు. మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్న.. ఇది మీ నుంచి వచ్చే చివరి రీమేక్ చిత్రం కావాలని కోరుకుంటున్నాను.. మీ రైటింగ్స్ తో మీరు సొంతంగా మ్యాజిక్ చేయవచ్చు.. మిరపకాయ్, షాక్ వంటి సినిమాలు ఇంకా నా మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి.. త్వరగా రీమిక్స్ సినిమాలు చేయడం ఆపేయండి అని నెటిజెన్ చెప్పుకొచ్చాడు.

Also Read: Kalki 2898 AD: కల్కి రెండో పార్ట్ కోసం వెరైటీ గా ప్లాన్ చేసిన నాగ్ అశ్విన్!!

దీనికి వెంటనే హరీష్ స్పందిస్తూ ఈ సినిమాను నువ్వు రీమేక్ అని ఫీల్ అయితే అప్పుడు మాట్లాడుకుందాం బ్రో నేను సోషల్ మీడియా ఫ్రెండ్లీ డైరెక్టర్ ఎప్పుడైనా నాతో కమ్యూనికేట్ చేయవచ్చు అని పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం హరీష్ ఇచ్చిన ఈ ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదేమైనా ఆగస్టు 15 కు ఈ సినిమాను విడుదల చేయడం పట్ల కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఆ రోజున భారీ సినిమాలు విడుదల ఉన్న నేపథ్యంలో సడన్ గా ఈ సినిమాను విడుదల చేయడం పట్ల కొంతమంది నిర్మాతలు ఫైర్ అవుతున్నారు