Suriya Movie For Sankranthi 2025

Suriya: పండుగ సీజన్లలో తమ సినిమాలను విడుదల చేయడానికి హీరోలు నిర్మాతలు తెగ పోటీ పడుతూ ఉంటారు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో తమ సినిమాలను విడుదల చేయాలని ప్రతి ఒక్క హీరో కూడా భావిస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ 2025వ సంక్రాంతికి చాలా సినిమాలే పోటీ పడుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా సంక్రాంతికి రావడానికి సిద్ధమవుతుంది. నాగచైతన్య తండేల్ కూడా సంక్రాంతిని టార్గెట్ చేసుకొని షూటింగ్ జరుపుకుంటుంది. వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాని కూడా సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు.

Suriya Movie For Sankranthi 2025

ఆ విధంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి మూడు భారీ సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతూ ఉండగా ఇప్పుడు కోలీవుడ్ హీరో కూడా సంక్రాంతిని టార్గెట్ చేసుకొని తన సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు. సూర్య ప్రస్తుతం కంగువ అనే సినిమా చేస్తున్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతూ ఉండగా ఈ సినిమా తర్వాత కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సూర్య ఒప్పుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

Also Read: Prabhas: సలార్ ఎఫెక్ట్.. ప్రభాస్ రెమ్యునరేషన్ తగ్గించేశాడా?

సూర్య పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను కూడా విడుదల చేసింది. పూజ హెగ్డే కథానాయకగా నటిస్తూ ఉండగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. గ్యాంగ్ స్టార్ కు సంబంధించిన కథతో రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య క్యారెక్టర్ కొత్తగా ఉంటుందట ఇది కాకుండా సుధా కొంగర దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు సూర్య. స్క్రిప్టు కూడా సిద్ధమయ్యింది. కొన్ని కారణాలవల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతుంది. దాంతో కార్తీక్ సుబ్బరాజు సినిమాను పట్టాలెక్కించాడు సూర్య.