Who is the hero who grabbed Shruti Haasan hair

Shruti Haasan: కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చాలా ట్రోలింగ్ ఎదుర్కొంది. ముఖ్యంగా ఆమె మొహంలో ముక్కు,పెదాలు బాగుండకపోవడంతో చాలామంది ట్రోల్ చేశారు.కానీ ఆ తర్వాత సర్జరీ చేయించుకొని దేవకన్యలా మారిపోయింది.ఇక ఈమె తెలుగులో అనగనగా ఓ ధీరుడు అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది.ఇక మొదటి సినిమా పేరు తెచ్చి పెట్టకపోయినప్పటికీ గబ్బర్ సింగ్, రేసుగుర్రం, ఎవడు, బలుపు, వీర సింహారెడ్డి, శ్రీమంతుడు, వాల్తేరు వీరయ్య ఇలా వరుస హిట్లతో జోరు మీదుంది. అంతేకాదు రీసెంట్ గా వచ్చిన సలార్ మూవీ కూడా శృతిహాసన్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది.

Who is the hero who grabbed Shruti Haasan hair

ఇక శృతిహాసన్ పై ఒక సెంటిమెంట్ ఉంది. అదేంటంటే ప్లాఫ్ హీరోలకు శృతిహాసన్ హిట్ అందిస్తుంది అనే సెంటిమెంట్ ఉంది.అలా చిరంజీవి, ప్రభాస్ లకి వాల్తేరు వీరయ్య,సలార్ సినిమాలతో హిట్ అందించింది. అయితే అలాంటి శృతిహాసన్ ని ఓ హీరో జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళాడట.. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు? ఎందుకు శృతిహాసన్ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళాడు అనేది ఇప్పుడు చూద్దాం.. (Shruti Haasan)

Also Read: Raj Tarun: రాజ్ తరుణ్ లవర్ లావణ్యకి మూడేళ్ల కూతురు ఉందా..?

శృతిహాసన్ జుట్టుపట్టుకొని ఈడ్చుకెళ్లిన హీరో ఎవరో కాదు. అడివి శేష్.. అయితే ఇదేదో కోపంతోనో లేక మరేదైనా కారణం కాదు.కేవలం సినిమా షూటింగ్లో భాగంగా.. రవితేజ, శృతిహాసన్,అంజలీ కాంబినేషన్లో బలుపు మూవీ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అడివి శేష్ నటించారు.అందులో భాగంగా శృతిహాసన్ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లే సన్నివేశం ఉంటుంది.అయితే ఈ సన్నివేశం చేయడానికి అడివి శేష్ చాలా సతమత పడ్డారట.

Who is the hero who grabbed Shruti Haasan hair

అంతేకాదు ఒక అమ్మాయిని అలా జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లడం ఆయనకు ఏమాత్రం సమంజసం అనిపించలేదట. ఇక ఈ సీన్ చేశాక ఆయన మీద ఆయనకే అసహ్యం పుట్టి అప్పటినుండి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం మానేసి హీరోగా వరుస సినిమాల్లో నటిస్తూ టైర్ -2 హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇక ఈయన నటించిన గూడచారి మూవీ సీక్వెల్ త్వరలో రాబోతోంది. ఇక ఈ సినిమా స్టోరీ ప్రిపేర్ కి చేయడానికే దాదాపు ఏడాదిన్నర టైం కేటాయించారట. మరి అంత సమయం కేటాయించారు అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.(Shruti Haasan)