Anasuya Trending Again in social media

Anasuya: కొంతమంది ఫేమస్ అయిపోవడానికి ట్రెండింగ్ లో ఉండడానికి నిత్యం ఏదో వివాదాన్ని సృష్టిస్తూనే ఉంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలపై బురద చల్లుతూ వారిని నోటికి వచ్చినట్లు మాటలు అంటూ లైమ్ లైట్ లో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు యాంకర్ అనసూయ. బుల్లితెరపై ఓ చిన్న షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకొని ఇప్పుడు వెండితెరపై మంచి మంచి సినిమా అవకాశాలు అందుకుంటుంది. ఆ విధంగా అనసూయ అందాలకు ప్రతి ఒక్కరు కూడా అట్రాక్ట్ అయ్యి ఆమెను ఓ పెద్ద సెలబ్రిటీ చేసేసారు.

అయితే అనసూయ చేతిలో ఇప్పుడు పెద్దగా సినిమాలేవి లేవని చెప్పాలి. రియాల్టీ షోలు కూడా పెద్దగా చేయడం లేదు. ఈ నేపథ్యంలో అందరూ తనను మరిచిపోతారు అనుకుంటుందో ఏమో మధ్య మధ్యలో సెలబ్రిటీల మీద కొన్ని ట్వీట్లు, పోస్టులు, కామెంట్లు చేస్తూ ట్రెండింగ్ లో ఉండాలని కోరుకుంటుంది. ఆ మధ్య ఓ యంగ్ హీరో పైన అనవసరమైన యాగి చేసి అందరి నోళ్ళల్లో నానింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఓ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో మళ్లీ అదే విషయాన్ని గెలుక్కుని మరి ఆ హీరో ఫ్యాన్స్ చేత తిట్లు తిట్టించుకుంటుంది.

Also Read: Mamitha Baiju: ప్రేమలు బ్యూటీ కి తెలుగు ఆఫర్స్!!

ఏదేమైనా చేతిలో సినిమాలు లేకపోవడంతో అందరూ తనను మర్చిపోకూడదు అనే ఉద్దేశంతోనే అనసూయ ఈ విధంగా చేస్తుంది అని కొంతమంది అంటుంటే మరి కొందరు ఆమె సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆ చిత్రం కు బజ్ రావాలని, అందరికీ తెలియాలని ఆమె ఇలా చేస్తుందని అంటున్నారు. ఏదేమైనా అనసూయ ఈ విషయానికి ఎప్పుడూ పుల్ స్టాప్ పెడుతుందో చూడాలి. మంచి అవకాశాలు అందుకుంటున్న అనసూయ దీనిని మరింత పొడిగిస్తూ తన అస్తిత్వాన్ని బజారున పడేసుకుంటుంది అని చెప్పాలి.

అంతేకాదు మీడియా కూడా దీని గురించి ఏమీ అడగ పోవడం పట్ల ఆమె నిప్పులు జరుగుతుంది. మీడియాను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఆమెకు మైనస్ అవుతుందని చెప్పాలి. మరి అనసూయ మాట్లాడిన ఈ మాటలకు మీడియా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి