Hanuman2 Director Prashanth Varma Planning

Hanuman2: తన మొదటి సినిమా నుంచే వెరైటీ చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల కళ్ళల్లో పడ్డ దర్శకుడు ప్రశాంతవర్మ. ఆయన ఇటీవల చేసిన ‘హనుమాన్’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా తో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు దర్శకుడు. పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఆ విధమైన సినిమా చేసి మెప్పించాలని భావించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ సంక్రాంతికి హనుమాన్ సినిమాను విడుదల చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఏ పెద్ద దర్శకుడుకి సాధ్యం కానంత రేంజ్ లో కలెక్షన్లను సాధించి ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ కుర్చీలో కూర్చున్నాడు.

Hanuman2 Director Prashanth Varma Planning

ప్రస్తుతం ఆయన హనుమాన్ 2 సినిమా యొక్క పనులలో నిమగ్నమై ఉన్నాడు. హనుమాన్ మొదటి భాగం సినిమా వచ్చి చాలా రోజులైనా కూడా ఈ రెండవ భాగం సినిమా ఇప్పటిదాకా మొదలు కాకపోవడం పట్ల అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. రెండో భాగం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని వారు చెబుతున్న నేపథ్యంలో ఆ చిత్రాన్ని భారీ తారాగణంతో చేసి మళ్లీ అందరి దృష్టిలో పడాలని ఈ దర్శకుడు భావిస్తున్నాడు.

Also Read: Janhvi Kapoor: జాన్వీ ప్రైవేట్ పార్ట్స్ ను ఫోటో తీసిన మీడియా.. ఫైర్ అయినా హీరోయిన్!!

అందుకే ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ను సంప్రదించగా కొన్ని రోజుల షూటింగ్ జరిగిన తర్వాత వారి మధ్య పొసగకపోవడంతో ఈ చిత్రం నుంచి రణవీర్ సింగ్ తప్పుకోవాల్సి వచ్చింది. ఫైనల్ గా ఈ పాత్ర కోసం టాలీవుడ్ హీరోనే పెట్టుకోవాలని చిత్ర బృందం భావించగా చిరంజీవి అయితే ఈ పాత్రకు చాలా బాగుంటుంది అని వారు భావించారట. ఈ నేపథ్యంలో వారు చిరంజీవిని సంప్రదించడం జరిగిందట. దీనిపై చిరంజీవి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు.

ఇకపోతే చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విశ్వంభర సినిమాను తెరకెక్కిస్తున్న ఆయన ఆ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో, హరీష్ చంద్ర దర్శకత్వంలో సినిమాలు చేయవలసి ఉంది. అయితే ప్రశాంత వర్మ సినిమాలో హీరో పాత్ర కాదు కాబట్టి కొన్ని రోజుల డేట్లు ఇస్తే సరిపోతుందని వారు చెబుతున్నారు. మరి చిరంజీవి నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఆయన ఆంజనేయ భక్తుడు కనుక ప్రశాంత్ వర్మ చేసే సినిమా కూడా ఆంజనేయస్వామి నేపథ్యంలో ఉంటుంది కాబట్టి ఆయన ఈ సినిమాను ఒప్పుకోవడం దాదాపు ఖరారు అని తెలుస్తుంది.