Hero comments on Heroine Janhvi Kapoor

Janhvi Kapoor: శ్రీదేవి నట వారసురాలుగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి తన అందాలతో ప్రేక్షకులను మైమరిచేలా చేస్తుంది హీరోయిన్ జాన్వీ కపూర్. ప్రస్తుతం తెలుగులో కూడా ఆమె వరుస సినిమాలను చేస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తూ ఉండగా రామ్ చరణ్ హీరోగా రాబోతున్న సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా ఎంపిక అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Hero comments on Heroine Janhvi Kapoor

రామ్ చరణ్ ఏరికోరి మరీ జాన్వీ నే హీరోయిన్ గా ఎంపిక చేశారట. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఈ ముద్దుగుమ్మకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. అక్కడ మంచి మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న నేపథ్యంలో చేసిన ఆమె నటించిన తాజా సినిమా ‘ఉలాజ్’ ఆగస్టు 2న విడుదల కాబోతుంది. మంచి ఫీల్ గుడ్ సినిమా గా రాబోతున్న ఈ సినిమా లో హీరో గా గుల్షన్ దేవయ్య హీరో గా నటిస్తున్నాడు.

Also Read: Janhvi Kapoor: జాన్వీ ప్రైవేట్ పార్ట్స్ ను ఫోటో తీసిన మీడియా.. ఫైర్ అయినా హీరోయిన్!!

అయితే ఈ సినిమా విడుదలకు ఉన్న నేపథ్యంలో హీరోయిన్ జాన్వీ పై కొన్ని కామెంట్లు చేశాడు గుల్షన్. జాన్వీ చాలా ప్రొఫెషనల్ గా నటిస్తుంది అని, తోటి నటీనటులతో స్నేహ భావంగా మెలగదని, డైరెక్టర్ చెప్పినప్పుడు మాత్రమే తన దగ్గరకు వస్తుందని, చెప్పింది చెప్పినట్లు యాక్ట్ చేస్తుందని వెల్లడించాడు. షూటింగ్ గ్యాప్ లో కూడా ఎక్కువగా మాట్లాడదు అని అందుకే మేము పెద్దగా ఫ్రెండ్స్ కాలేకపోయామని తెలిపాడు. దీనిపై బాలీవుడ్ బ్యూటీ స్పందించి నిజంగానే మేము కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకోలేదు. కాఫీ కి కూడా వెళ్లలేదు అని చెప్పింది.

ఈ మాటలను బట్టి ఆమె చాలా ఫీల్ అయిందని తెలుస్తుంది. ఏదేమైనా ఒక హీరోయిన్ పట్ల ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. దీనిపై ఆ హీరో ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఇప్పటిదాకా చాలామంది హీరోయిన్ల పై ఇలాంటి విమర్శలు వచ్చాయి. తెలుగులో ఇలియానా పై కూడా కొంతమంది హీరోలు దర్శకులు ఆమెపై ఇలాంటి విమర్శలు చేశారు. మరి హీరోయిన్లు ఇష్టం లేక ఈ విధంగా నడుచుకుంటారో లేదా వారి స్వభావమే అలా ఉంటుందో తెలియదు.