Heroine Mamitha Baiju got telugu cinema chance

Mamitha Baiju: సినిమా పరిశ్రమలో ఎవరైనా కొత్త హీరోయిన్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటే వారికి అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ఏ మాత్రం ఆలస్యం చేయరు. ఆ విధంగా ‘ప్రేమలు’ అనే ఓ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ కు తెలుగులో అవకాశం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మన తెలుగు దర్శక నిర్మాతలు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఓ సినిమాలో ఈమెను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు అనే వార్తలు తెగ వినిపిస్తున్నాయి.

Heroine Mamitha Baiju got telugu cinema chance

మమతా బైజు.. ప్రేమలు సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ హీరోయిన్ మలయాళం లో మాత్రమే కాదు ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకర్షించింది. అందుకే ఆమెను తెలుగు సినిమాలలో కూడా హీరోయిన్ గా తీసుకురావాలని చాలామంది సోషల్ మీడియా వేదికగా అడిగారు. దాంతో దర్శక నిర్మాతలు ఈమెతో సినిమా చేయడానికి సంప్రదింపులు చేయగా ఫైనల్ గా ఆమె తెలుగులో ఓ సినిమాను ఒప్పుకున్నట్లుగా తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: IPL 2025: రాహుల్ ద్రావిడ్, యువరాజ్ లకు కీలక పదవులు ?

‘లవ్ టుడే’ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరో ప్రదీప్ రంగరాజన్ తెలుగులో ఓ సినిమా చేయబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారి బ్యానర్ లో చేస్తున్న ఈ ప్రేమ కథ సినిమాను ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా ఈ చిత్రంలో హీరోయిన్ కోసం చాలా రోజులుగా వారు వెతుకుతున్నారు. ఓ ఫ్రెష్ పేస్ కోసం వెతుకుతున్న నేపథ్యంలో ప్రేమలు సినిమా చూసిన తరువాత ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు ఆమెతే సూట్ అవుతుంది అని చెప్పి ఆమెను ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించారు. కొన్ని రోజులు సమయం తీసుకున్న మమిత ఈ చిత్రాన్ని చివరకు ఒప్పుకోవడం విశేషం.

ఒకవేళ ఈ సినిమా వర్కౌట్ అయ్యి ఆమెకు మంచి పేరు తీసుకువస్తే మాత్రం టాలీవుడ్ యంగ్ హీరోలు అందరూ ఆమె కోసం క్యూ కట్టడం ఖాయం అని చెప్పాలి. ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ల కొరత బాగానే ఏర్పడింది ఒకరిద్దరూ హీరోయిన్లు తప్ప ఎక్కువ మంది హీరోయిన్లు తెలుగులో కనిపించడం లేదు. కొత్తగా వచ్చిన కూడా వారి పెర్ఫార్మెన్స్ లో లోపం ఉండడంతో ప్రేక్షకులకు పెద్దగా నచ్చడం లేదు. ఇటు అందం పరంగా అభినయం పరంగా బాగానే కనిపిస్తున్న మమత భవిష్యత్తులో హిట్టు కొడితే మాత్రం టాప్ హీరోయిన్ కావడం ఖాయం.