Mrunal Thakur marriage is fixed with that Tollywood hero

Mrunal Thakur: ఏంటి సీతారామం బ్యూటీ పెళ్లి చేసుకోబోతుందా అని నోరెళ్ళ పెడతారు ఈ విషయం తెలిస్తే చాలామంది జనాలు.. ఓ 10, 15 సినిమాల్లో కూడా నటించలేదు అప్పుడే పెళ్ళా అంటారు ఇంకొంత మంది ఈమె అభిమానులు. మరి నిజంగానే మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతుందా.. ఇంతకీ మృణాల్ ఏ టాలీవుడ్ హీరో ఇంటికి కోడలుగా వెళ్లబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం.బాలీవుడ్ లో ఎన్ని సీరియల్స్ లో సినిమాల్లో నటించినా రాని గుర్తింపు మృణాల్ ఠాకూర్ కి హనూ రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ద్వారా వచ్చింది.

Mrunal Thakur marriage is fixed with that Tollywood hero

ముఖ్యంగా ఈ సినిమా చూసి వచ్చాక ఆనందభాష్పాలతో డైరెక్టర్ హనూ రాఘవపూడిని హగ్ చేసుకుంది మృణాల్. దాంతో ఆమెకు ఇప్పటివరకు ఇలాంటి హిట్ ఏ సినిమా ద్వారా రాలేదు అని అందరికీ అర్థం అయిపోయింది. అలా ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది.ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న మూవీ కూడా అందరిని ఆకట్టుకుంది. అలా టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. (Mrunal Thakur)

Also Read: Anjali: వేశ్య పాత్ర కోసం సెట్ లో అందరి ముందు అలా చేసిందట!!

అలాంటి ఈ ముద్దుగుమ్మ గత కొద్దిరోజుల నుండి ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉందనే వార్త సినీ సర్కిల్స్ లో ఎంత వైరల్ అవుతుందో చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా ఈ జంట నవంబర్లో పెళ్లికి రెడీ అయినట్టు కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ రూమర్స్ మాత్రమే కాదు తాజాగా మృణాల్ ఠాకూర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలను చూసి నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఎందుకంటే గత కొద్దిరోజుల నుండి మృణాల్ ఠాకూర్ సాంప్రదాయంగా ఉండే డ్రెస్సులు అంటే చీర,లెహంగా,చుడిదార్ వంటివి వేసుకొని ఫోటోలకి ఫోజులిస్తోంది.

Mrunal Thakur marriage is fixed with that Tollywood hero

అయితే ఈ ఫొటోస్ చూసిన జనాలు చాలామంది ఈమె పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు టాలీవుడ్ హీరో ఫ్యామిలీ వాళ్ళు సంప్రదాయంగా ఉండాలని కండిషన్లు పెట్టడం వల్లే ఇలా కొద్ది రోజులు నుండి సాంప్రదాయమైన దుస్తులు ధరిస్తున్నావా.. పరోక్షంగా ఇలాంటి డ్రెస్సులు వేసుకొని పెళ్లి చేసుకోబోతున్నాను అని హింటిస్తున్నావా అంటూ కొంతమంది నెటిజన్లు ఆమె పెట్టిన పోస్టులకి కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఆమెకి నెటిజన్స్ పెట్టిన పోస్టులు వైరల్ అవ్వడంతో చాలా మంది జనాలు మృణాల్ నిజంగానే పెళ్లి చేసుకోబోతుంది కావచ్చు అని భావిస్తున్నారు.(Mrunal Thakur)