Sai Dharam Tej Marriage news

Sai Dharam Tej: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న హీరో సాయి ధరంతేజ్. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకొని మాస్ హీరోగా ఎదిగిన సాయి తేజ్ గురించి తాజాగా ఓ విషయం ప్రేక్షకులను ఎంతగానో ఆసక్తి పరుస్తుంది. మెగా మేనల్లుడుగా సినిమా పరిశ్రమ లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నాడు. ఆ విధంగా ప్రస్తుతం వరుస మంచి సినిమాలను చేస్తున్న ఈ హీరో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు టాలీవుడ్ లో తెగ షికార్లు చేస్తున్నాయి.

Sai Dharam Tej Marriage news

గతంలో ఓ హీరోయిన్ తో ఈ హీరో ప్రేమాయణం నడిపాడని, వారి ప్రేమ పెళ్లిదాకా వెళ్ళిందని వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు ఈ హీరో హీరోయిన్లు ఏమాత్రం కలుసుకోవడం లేదు. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ తో ఈ హీరో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు రావడం అయన అభిమానులను సంతోషంతో పాటు అయోమయానికి కూడా గురిచేస్తుంది. సినిమాలు చేసుకుంటూ పోవడమే తప్ప కాంట్రవర్సీలకు బాగా దూరంగా ఉండే సాయి తేజ పై ఈ విధమైన రూమర్స్ రావడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అనే చెప్పాలి.

Also Read: Thamanna: తమన్నా అందాలకు ఎంత కష్టం.. ఫిజిక్ అలాంటిది మరీ..!!

గత సంవత్సరం ఈ హీరోకి యాక్సిడెంట్ కావడంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని మరి సినిమాలు చేయడానికి ముందుకు వచ్చాడు. రావడమే విరూపాక్ష అనే సినిమాతో విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి రాగా ఇప్పుడు మరికొన్ని ఆసక్తికరమైన సినిమాలను చేయడానికి సిద్ధమవుతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే సినిమా చేస్తున్న సాయి ధరంతేజ్ మరో ఇంట్రెస్టింగ్ సినిమాను కూడా చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ విధంగా తమ సినిమా పనులలో తాను ఉంటే గతంలో తాను ఓ సినిమాలో నటించిన హీరోయిన్ తో పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు రావడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచే స్తుంది చేస్తుంది.

జవాన్ అనే సినిమాలో తనతో పాటు హీరోయిన్ గా నటించిన మెహరీన్ ను సాయి ధరంతేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు ఇప్పుడు వస్తున్నాయి. గతంలో ఈమెకు పెళ్లి నిశ్చయం కాగా దానిని క్యాన్సిల్ చేసుకుని మరి సినిమాలలో నటిస్తూ వచ్చింది. ఆ విధంగా వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని అందుకే సినిమాలు కూడా మానేసి సాయి ధరంతేజ్ ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంది అని అంటున్నారు. దీనిపై హీరో టీమ్ స్పందించి అలాంటిదేమీ లేదని వెల్లడించింది. మరి దీనిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడవలసిందే.