22 Years Of Indra: The beauty who missed the chance of heroine in Indra movie

22 Years Of Indra: మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అశ్వినీ దత్ నిర్మాతగా.. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టిన మూవీ ఇంద్ర.. ఈ సినిమా జూలై 24, 2002లో ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.అలా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టిన ఈ మూవీ లో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వల్ లు నటించారు.

22 Years Of Indra: The beauty who missed the chance of heroine in Indra movie

కానీ ఆర్తి అగర్వాల్ కంటే ముందే మరో హీరోయిన్ కి ఈ మూవీ ఛాన్స్ వచ్చిందట. ఇక ఆ హీరోయిన్ ఎవరు.. ఈ మూవీలో ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకుంది అనేది ఇప్పుడు చూద్దాం.. ఘరానా మొగుడు తర్వాత చిరంజీవికి అంత మంచి సినిమాలు పడలేదు. కానీ ఇంద్ర సినిమాకి మాత్రం ఎక్కడలేని క్రేజ్ వచ్చి పడింది. (22 Years Of Indra)

Also Read: Varun Sandesh: రాజ్ తరుణ్ లావణ్య గురించి షాకింగ్ విషయం బయటపెట్టిన వరుణ్ సందేశ్..?

ఇక మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో టాప్ 5 బెస్ట్ మూవీస్ లో ఇంద్ర సినిమా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు.అయితే అలాంటి ఈ బ్లాక్ బస్టర్ మూవీలో ఆర్తి అగర్వాల్ కంటే ముందే హీరోయిన్ ఛాన్స్ సిమ్రాన్ కి వెళ్ళిందట.అప్పటికే సిమ్రాన్ చిరంజీవి కాంబినేషన్లో మృగరాజు వచ్చింది.

22 Years Of Indra: The beauty who missed the chance of heroine in Indra movie

అయితే దాదాపు సిమ్రాన్ ని ఫిక్స్ చేసి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సిమ్రాన్ ని తీసేసి ఆమె ప్లేస్ లో ఆర్తి అగర్వాల్ ని పెట్టుకున్నారట. అలా సిమ్రాన్ ఈ సినిమాలో ఛాన్స్ మిస్ అయింది.ఇక ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టి ఎన్నో రికార్డులను చెరిపేసింది. అంతేకాదు సినిమాకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. అయితే అలాంటి ఈ బ్లాక్ బస్టర్ మూవీ మెగాస్టార్ బర్త్డే కానుకగా ఆగస్టు 22 రీ రిలీజ్ కాబోతోంది.(22 Years Of Indra)