Varun Sandesh revealed a shocking thing about Raj Tarun Lavanya

Varun Sandesh: ఒకప్పుడు హ్యాపీడేస్,కొత్త బంగారులోకం, ఏమైంది ఈవేళ, కుర్రాడు,ఎవరైనా ఎప్పుడైనా, మరోచరిత్ర,చమ్మక్ చల్లో వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న వరుణ్ సందేశ్ క్రేజ్ టాలీవుడ్ లో ఒక్కసారిగా పడిపోయింది. ఆయన నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఈయనకి ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. అలా కొద్దిరోజులు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలో భార్యతో కలిసి కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మళ్లీ ఫేమస్ అయ్యారు.

Varun Sandesh revealed a shocking thing about Raj Tarun Lavanya

ప్రస్తుతం వరుణ్ సందేశ్ వరుస సినిమాలు చేస్తూ మళ్ళీ జోరు చూపిస్తున్నారు.అయితే తాజాగా ఈయన నటించిన విరాజి మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ సందేశ్ రాజ్ తరుణ్, లావణ్య గురించి సంచలన కామెంట్స్ చేశారు.అయితే వరుణ్ సందేశ్, నిఖిల్, రాజా రవీంద్ర వంటి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లకి తమ లవ్ మ్యాటర్ తమ పెళ్ళి మ్యాటర్ తెలుసు అంటూ లావణ్య ఆ మధ్య కాలంలో చెప్పిన సంగతి మనకు తెలిసిందే.(Varun Sandesh)

Also Read: Arjun: అర్జున్ రెండో కూతురు ఫిక్స్ పెళ్లి .. అబ్బాయి ఎవరంటే.?

అయితే ఇదే విషయం గురించి విరాజి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ సందేశ్ పాల్గొన్న సమయంలో ఇంటర్వ్యూవర్ ఆయన్ని ప్రశ్న అడగగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. నాకు చాలా రోజుల నుండి రాజ్ తరుణ్,లావణ్య తెలుసు. అయితే మా ఇంటి దగ్గరే ఉండడంతో చాలా సంవత్సరాల నుండి పరిచయం ఉంది.

Varun Sandesh revealed a shocking thing about Raj Tarun Lavanya

అయితే గత సంవత్సరంన్నర నుండి మాకు వారికి అంత సంబంధాలు లేవు. ఎందుకంటే అప్పట్లో పక్కపక్క ఇల్లు కాబట్టి అప్పుడప్పుడు కలుసుకున్నాం.కానీ ఏడాదిన్నర నుండి మాకు వారితో పరిచయం లేదు.అలాగే వీరికి సంబంధించిన ఇష్యూ కోర్టులో నడుస్తోంది. దీని గురించి ఇప్పుడు నేను స్పందించడం అంత మంచిది కాదు.అలాగే ఈ విషయం గురించి వాళ్లు చెబితేనే బాగుంటుంది నేను మాట్లాడితే బాగోదు అంటూ వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చారు.(Varun Sandesh)