Devara Movie changes fans fire on koratala shiva

Devara: ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ను అక్టోబర్ లో విడుదల చేయడానికి నిర్మాతలు రంగం సిద్ధం చేశారు. ఈ సినిమా లో బాలీవుడ్ హీరో లు సైఫ్ ఆలీఖాన్, బాబీ డియోల్ విలన్ లు గా నటిస్తుండగా మరింత మంది అగ్ర నటులు ఈ సినిమా లో నటిస్తున్నారు. ఇప్పటివరకైతే ఈ చిత్రం పట్ల బజ్ గట్టిగానే ఉంది. కొరటాల శివ గత సినిమా ఆచార్య ఫ్లాప్ అయినా కూడా ఆయనకున్న ట్రాక్ రికార్డు ను చూసి ఎన్టీఆర్ ఈ ఛాన్స్ ఇచ్చాడు.

Devara Movie changes fans fire on koratala shiva

అలా ఈ సినిమాతో మరోసారి తనని తాను నిరుపించుకోవాల్సిన అవసరం కొరటాల శివ కి ఎంతైనా ఉంది. కెరీర్ లో అపజయం అనేదే లేకుండా దూసుకెళ్తున్న కొరటాల శివ కి ఆచార్య బ్రేక్ వేసింది. మెగా స్టార్ చిరంజీవి హీరో కావడం, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటించడం తో ఈ సినిమా పై ప్రేక్షకులలో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ప్రేక్షకులు సినిమా ను ఆదరించలేకపోయారు. ఏదేమైనా ఆ పరిస్థితి నుండి కోలుకుని కొరటాల శివ ఇప్పుడు దేవర సినిమా ను చేస్తున్నాడు.

Also Read: Heroine: యాక్టింగ్ రాదు..అందం లేదు.. ఆ హీరోయిన్ వేస్ట్.. డైరెక్టర్ కామెంట్స్!!

ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ లు వేరే స్థాయి లో ఉన్నాయని చెప్పాలి. అయన మార్క్ కి తగ్గట్లుగా, ఎన్టీఆర్ రేంజ్ కి సూట్ అయ్యేలా ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా కి సంబందించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఎన్టీఆర్ ఈ సినిమా లోని కొన్ని సీన్స్ పట్ల పెద్దగా ఇష్టంగా లేరట. దాన్ని రేశూట్ చేయాలనీ అన్నారట. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందనే అసహనాన్ని వెల్లడిస్తున్నారు.

ఫ్లాప్ లో ఉన్న దర్శకుడికి ఛాన్స్ ఇస్తే దాన్ని వినియోగించుకోవాలని అలా కాకుండా రీ షూట్ చేసే దాకా తీసుకురావడం ఎంతని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ విధంగా మార్పులు, రీ షూట్ లు చేయడం సినిమా కి అంత మంచిది కాదనేది వారు చెబుతున్న మాట. ఇప్పటికే అనిరుద్ ఇచ్చిన పాటకు మిక్స్డ్ రిపోర్ట్స్ వచ్చాయి. సినిమా పై అది తప్పకుండా ప్రభావం చూపించిందనే చెప్పాలి. ఆ విధంగా సినిమా అయిన గట్టిగా ఉంటుందని భావించిన వారికి ఇలాంటి న్యూస్ లు బయటకు రావడం టెన్షన్ పెట్టిస్తుంది. ఇకపోతే ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు దేశవ్యాప్తంగా పెరిగిపోయాయి. దీని తర్వాత కూడా కొన్ని భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.