Nani new avatar for his new movie hit

Nani: నాచురల్ స్టార్ నాని తన సినిమాలు చేసే విషయంలో ఎందుకు అంతగా భయపడుతున్నాడో తెలియదు కానీ ఆయన హీరోగా నటించబోయే ఓ సినిమా కోసం ఏకంగా రచయితగా కూడా అవతారం ఎత్తాడట. తెలుగు సినిమా పరిశ్రమలో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన హిట్ సీక్వెల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొదటి భాగంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన రెండో భాగంలో అడివి శేష్ హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలు కూడా వారికి మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చాయి. వారి కెరియర్లో మంచి విజయాలుగా నిలిచాయి.

Nani new avatar for his new movie hit

ఈ నేపథ్యంలోనే హిట్ యొక్క మూడవ భాగాన్ని నాని హీరోగా తెరకెక్కించాలని దర్శకుడు అభిప్రాయపడ్డాడు. దానికి సంబంధించిన ఓ ప్రోమో కూడా ఇప్పటికే విడుదలయ్యింది.హిట్ 2 సినిమా క్లైమాక్స్ లో ఓ సీన్ కూడా జత చేసి అనౌన్సు చేశారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నాని కెరియర్ లోనే మంచి చిత్రంగా మిగిలిపోతుంది అని ప్రతి ఒక్కరు భావిస్తుండగా ఇప్పుడు ఈ సినిమా కోసం దర్శకుడుని నమ్మకుండా ఆయనే రచయితగా వ్యవహరిస్తూ ఉండడం సినిమా పరిశ్రమలో కొంతమంది విమర్శలు చేసే విధంగా ఉంది.

Also Read: Prabhas: చిన్న సినిమాలు చేసే ఆలోచనలో ప్రభాస్.. విసిగిపోయాడా?

దర్శకుడికి ఫ్రీడమ్ ఇస్తేనే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది అలా కాకుండా ప్రతి ఒక్కరు వచ్చి కథలో కథనంలో వేలు పెడితే అది పెద్దగా వర్కౌట్ అయిన సందర్భాలు లేవు. ఆ విధంగా నాని దర్శకుడు శైలేంద్ర కథలో కథనంలో ఇన్వాల్వ్ అవడం ఈ సినిమాకు అంత మంచిది కాదని చెబుతున్నారు. ఇప్పటికే వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న నాని ఈ విధంగా చేయడం అంత మంచిది కాదని అంటున్నారు. ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాలో హీరోగా చేస్తున్న నాని ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మాస్ యాక్షన్ సినిమా గా రాబోతున్న ఈ సినిమా ఆయనకు మంచి విజయాన్ని సాధించాలని అభిమానులు కోరుతూ ఉండగా ఇప్పటినుంచే వారు హిట్ 3 కోసం ఎదురుచూస్తున్నారు. పోలీస్ అవతారంలో నాని కనిపించబోతుండగా ఈ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.