Nani new image on his movies

Nani: కొంతమంది హీరోలు త్వరగా నెంబర్ వన్ స్థానానికి ఎదగాలనే ప్రయత్నంలో తమ చేతులు తాము కాల్చుకుంటూ ఉంటారు. ఎక్కడలేని హైప్ తమ సినిమాలకు తీసుకురావాలని చెప్పి తొందరపాటు పనులు చేస్తూ ఉంటారు. ఆ విధంగా హీరో నాని మొదటి నుంచి మంచి మంచి సినిమాలను చేసుకుంటూ వచ్చి హీరోగా ప్రేక్షకులలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ఇప్పుడు మాస్ ముద్ర వేసుకోవాలనే తపనతో కొన్ని తొందరపాటు పనులు చేసి ఉన్న ఇమేజ్ను పోగొట్టుకుంటున్నాడు. ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్న నాని.

Nani new image on his movies

ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో యాక్షన్ సినిమా చేయాలని భావించాడు కానీ నిర్మాతకు హీరోకి మధ్య బడ్జెట్ కుదరకపోవడంతో ఈ సినిమా క్యాన్సిల్ అయింది. అలా తన మార్కెట్ కు సరిపడని దర్శకులతో తన రేంజ్ కు మించిన కథలతో ప్రేక్షకులను మెప్పించాలని నాని అనుకోవడం ఆయన కెరియర్ కు మైనస్ అవుతుందని చెప్పాలి. దానికి తోడు మాస్ మంత్రాన్ని జపిస్తున్న నాని దానికి సూట్ అవ్వడు అనే విషయం పాపం ఆయనకు ఎవరు చెప్పటం లేదేమో. మాస్ చిత్రాలు చేయాలని కలవరిస్తూ తనకు ఉన్న ఇమేజ్ పోగొట్టుకుంటున్నాడు అని ఆయన అభిమానులే చెప్పుకుంటున్నారట.

Also Read: Heroine: యాక్టింగ్ రాదు..అందం లేదు.. ఆ హీరోయిన్ వేస్ట్.. డైరెక్టర్ కామెంట్స్!!

అంతేకాదు ఇప్పుడు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో చేయబోయే సినిమాను సైతం పాన్ ఇండియా స్థాయిలో చేయబోతున్నాడట. కథలో దమ్ముంటే ఆ విధంగా చేస్తే బాగానే ఉంటుంది కానీ ఆ కథలో ఎంతవరకు పొటెన్షియల్ ఉంటుందో చూడాలి. ఈ చిత్రం కోసం జాహ్నవి కపూర్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారు. ఏదేమైనా పక్కింటి అబ్బాయిలాంటి కథ ఉన్న సినిమాలలో చూడడానికి నాని పనికొస్తాడు కానీ మాస్ హీరోగా చూడాలంటే మాత్రం 6 ఫిట్లున్న హీరోలే కావాలని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు.