Nithin pawan song remake in thammudu movie

Pawan Kalyan: స్టార్ హీరో యొక్క క్రేజీ ఉపయోగించుకోవడం ఈ తరం యువ హీరోలకు అలవాటయిపోయింది. ప్రేక్షకులలో భారీ అభిమానం ఉన్న హీరోలను భారీ అభిమానులు ఉన్న హీరోలను పొగడడం వారి అభిమానులను మచ్చిక చేసుకోవడం వంటివి ఎప్పటినుంచో జరుగుతూ వస్తుంది. అయితే అది మితిమీరితే అందరిలో అసహనం పుడుతుంది అని సదరు హీరోలు అర్థం చేసుకోవడం లేదు. ఆ విధంగా హీరో నితిన్ పవన్ కళ్యాణ్ భజన చేయడం మనం ఎప్పటినుంచో చూస్తున్నాం. ఆయన సినిమాలకు పవన్ కళ్యాణ్ అభిమానులు సపోర్టు చేయడం కూడా చూస్తున్నాం.

Nithin pawan song remake in thammudu movie

ఇది కొంతవరకు బాగానే ఉంది కానీ నితిన్ చేస్తున్న ప్రతి సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ను వాడి ఆయన అభిమానులను దగ్గర అవ్వాలనుకోవడం నితిన్ అభిమానులకు కూడా పెద్దగా నచ్చటం లేదు. కెరియర్ ప్రారంభంలో తన సినిమాలకు మంచి మైలేజ్ రావాలి అంటే ఆ విధంగా ఉపయోగించుకోవడం బాగానే ఉంటుంది. కానీ నితిన్ ఇప్పుడు హీరోగా నిలదొక్కుకున్న నేపథ్యంలో ఇంకా పవన్ కళ్యాణ్ క్రేజ్ ను వాడుకోవాలని చూడడం సొంత అభిమానులకి ఏమాత్రం నచ్చడం లేదు.

Also Read: Nani: అతడిని పక్కనపెట్టిన నాని.. అంత భయం ఎందుకు నేచురల్ స్టార్!!

హీరో నితిన్ ప్రస్తుతం ‘తమ్ముడు’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగుతుంది. అలనాటి నటి ‘లయ’ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తూ ఉండగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాటను రీమేక్ చేసే విధంగా ఆలోచన చేస్తున్నాడట నితిన్. ఈ సినిమా యొక్క టైటిల్ కూడా గతంలో పవన్ నటించిన సినిమా యొక్క టైటిల్ కావడం గమనార్ధం. మరి పవన్ కళ్యాణ్ భజన నితిన్ కు ఈ సినిమా ద్వారా మంచి పేరును తీసుకువస్తుందా.. హిట్టును తీసుకువస్తుందా అనేది చూడాలి.

Nithin pawan song remake in thammudu movie