Prashanth Neel movies with telugu heroes

Prashanth Neel: కేజీఎఫ్ సినిమా తో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ఒక్క సినిమా తోనే దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ దర్శకుడు రెండో సినిమా కేజీఎఫ్ 2 తో స్టార్ డైరెక్టర్ గా మారి అందరు హీరోలు సినిమాలు చేయాలనుకునే జాబితాలో చేరిపోయాడు. అందుకే కోలీవుడ్, టాలీవుడ్ పెద్ద హీరో లు ఆయనతో డిన్నర్ డేట్లు కూడా చేసి ఇన్ డైరెక్ట్ గా తమ తో సినిమా చేయాలనీ చెప్పుకొచ్చారు. ఏదేమైనా ప్రశాంత్ నీల్ ఆ తర్వాత తెలుగు హీరో లతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించారు.

Prashanth Neel movies with telugu heroes

ఇంకోవైపు కన్నడ ప్రేక్షకులు ప్రశాంత్ నీల్ ను విమర్శించినా కూడా ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేశాడు. ఆ చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా రెండో భాగం పై పూర్తి దృష్టి సారించాడు ప్రశాంత్ నీల్. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలి ప్రశాంత్. కనీ ఆ సినిమా ఇప్పట్లో అయ్యేలా కనిపించడం లేదు. ఎన్టీఆర్ దేవర సినిమా తర్వాత బాలీవుడ్ వార్ 2 సినిమా చేయనున్నాడు. ఆ సినిమా తర్వాత మళ్ళీ దేవర రెండో భాగం చేయాలి. ఇది జరగడానికి మూడేళ్లైన పడుతుంది.

Also Read: Samantha: సమంత చైతును వదిలేసినందుకు బాధపడుతుందా?

ఈలోపు ప్రశాంత్ నీల్ సలార్2 సినిమా చేసి ఖాలిగా ఉంటాడు. అయితే ఇంత పెద్ద దర్శకుడు ఖాళీగా ఉండడానికి అస్సలు ఇష్టపడడు కాబట్టి అయన కేజీఎఫ్ 3 సినిమా చేయడానికి సిద్దపడుతున్నాడని అంటున్నారు. అలా ఎన్టీఆర్ సినిమా అయితే ఇప్పట్లో జరిగేలా మాత్రం కనపడడం లేదు. ఇటు రామ్ చరణ్ సినిమా కి అజిత్ అడ్డుగా నిలుస్తున్నాడు. కేజీఎఫ్ సినిమా తర్వాత అజిత్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రశాంత్. ఇప్పటికే చర్చలు కూడా జరిగాయి.

ఈ నేపథ్యంలో అజిత్ సినిమా చేస్తే మాత్రం ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ కు హ్యాండ్ ఇవ్వడం ఖాయం అని చెప్పాలి. రామ్ చరణ్ కూడా శంకర్ దర్శకత్వంలోని సినిమా ను పూర్తి చేస్తున్నాడు. డిసెంబర్ లో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలోని సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది వరకు జరగనుంది. ఆ తర్వాత రామ్ చరణ్ ఎవరితో సినిమాలు చేస్తాడో చూడాలి.