Sai Dharam Tej six pack for his new movie

Sai Dharam Tej: కొంతమంది హీరోలు తమ సినిమాలలో డాన్సులు, నటనతో పాటు ప్రేక్షకులకు సరికొత్తగా ఏదైనా చూపించాలని భావిస్తూ ఉంటారు. ఆ విధంగా ఎంతోమంది వారిలో ఉన్న కొత్త టాలెంట్ను ప్రేక్షకులకు చూపిస్తూ వారిని అభిమానులుగా మార్చుకున్నారు. ఆ విధంగా మెగా హీరోలలో ఒకరైన సాయి ధరంతేజ్ తాజాగా తన కొత్త సినిమా కోసం సిక్స్ ప్యాక్ ను ప్రేక్షకులకు చూపించబోతున్నారట. ఆయన హీరోగా నటిస్తున్నా ఓ కొత్త సినిమా కోసం ఆయన ఈ విధమైన ప్రయోగం చేయబోతున్నారట. యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష సినిమాలో నటించిన సాయి ధరంతేజ్ ఆ సినిమా ద్వారా విజయాన్ని అందుకున్న కూడా ఆయన ఫిట్నెస్ పై విమర్శలు వచ్చాయి.

Sai Dharam Tej six pack for his new movie

యాక్సిడెంట్ తర్వాత విశ్రాంతి తీసుకున్న కారణంగా కొంచెం బొద్దుగా మారాడు సాయి ధరంతేజ్. అప్పటికే కమిట్మెంట్ అయి ఉన్న సినిమా కాబట్టి దాన్ని ఆ విధంగానే కొనసాగించి పూర్తి చేసి హిట్టు కొట్టాడు. కానీ ఆయన మేకోవర్ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్న వేళ అదే మేకోవర్ కాకుండా కాస్త డిఫరెంట్ గా ట్రై చేయాలని చెప్పి 6 ప్యాక్స్ కోసం చేస్తున్నాడట. మరి ఈ మేకోవర్ ఆయన సినిమాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూడాలి. అయితే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మాత్రమే సినిమాలో దమ్ము లేకపోవడం వలన ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ విధమైన ఎత్తులు వేస్తున్నాడని చెబుతున్నారు.

Also Read: Devara: ‘దేవర’ లో కొరటాల మార్పులు చేస్తున్నాడా.. ఆచార్య రిపీట్ అవ్వదుగా!!

సినిమాలలో హీరో అంటే హీరో లాగే కనబడాలి కాబట్టి సాయి ధరంతేజ్ చేస్తున్న ఈ ప్రయత్నంలో తప్పేం లేదని చెప్పవచ్చు. ఇక సంపత్ నంది దర్శకత్వంలో చేయవలసిన ‘గాంజా శంకర్’ సినిమా క్యాన్సిల్ కావడంతో ఈ సినిమా కోసం సాయి ధరంతేజ్ భారీగానే శ్రమిస్తున్నాడు. వెరైటీ సినిమా గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. త్వరలోనే పట్టాలెక్కబోతున్న నేపథ్యంలో ఈ సినిమా సాయి ధరం తేజ్ కెరీర్ ను ఓ మెట్టు పైకి తీసుకెల్తుందా అనేది చూడాలి.