Samantha regret About her past life

Samantha: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా మంచి పేరు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత నాగచైతన్య ను పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడాకులు చేసుకున్న విషయం తెలిసిందే. సినిమాలలో తనకంటూ ప్రత్యేకత ను ఏర్పరుచుకుని తనకు ఎదురులేదని నిరూపించుకుంది. ఏలాంటి పాత్రనైనా అవలీలగా చేసింది. అంతేకాదు స్టార్ హీరోలతో కలిసి డాన్స్ లను సైతం ఇరగదీసింది. గ్లామర్ ప్రదర్శనలోనూ తనకు సాటి ఎవరూ లేరని చాలా సినిమాలలో చెప్పకనే చెప్పింది. వివిధ రకాల స్క్రిప్టులను ఎంచుకుంట సరికొత్త పాత్రలను అన్వేషిస్తూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను కూడా చేసి తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ను ఏర్పరచుకుంది.

Samantha regret About her past life

ఆ విధంగా దేశవ్యాప్తంగా ఆమెకు పాపులారి రావడానికి కారణం నాగచైతన్యతో విడాకులు అనే చెప్పాలి. అప్పటిదాకా సౌత్ సినిమా పరిశ్రమలో మాత్రమే ఆమె గురించి ఎక్కువగా మాట్లాడకునే వారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా సమంత గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఏదేమైనా పరోక్షంగా ఆమె ఇంత పాపులర్ అవ్వడానికి కారణం మాత్రం వారి విడాకులు అని చెప్పాలి. తాజాగా ఇన్సైడ్ సమాచారం ప్రకారం నాగచైతన్యను విడిచి పెట్టాలని నిర్ణయం తీసుకోవడం పట్ల ఆమె ఎంతో బాధ పడుతున్నట్లు తెలుస్తుంది.

Also Read: Balayya: చంద్రబాబుపైన అలిగిన బాలయ్య?

ఇది తన జీవితంలో జరిగిన పెద్ద తప్పుగా భావిస్తుందట సమంత. ఆమె చేసిన ఓ ప్రకటన దీనికి మరింత ఆద్యం పోస్తుంది. ప్రియమైన వారితో సన్నిహితంగా ఉండాలి.. వారితో కలిసి ఉండాలి.. లేదంటే పశ్చాత్తాప పడాలి అని ఆమె చెప్పింది.. ఆ విధంగా సమంత ఫీలింగ్స్ చెప్పిన నేపథ్యంలో ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. మరి ఇది నిజమా.. లేక ఎవరైనా క్రియేట్ చేశారా అనేది చూడాలి. దీనిపై సమంత ఎలా స్పందిస్తుందో మరీ.