Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఐపీఎల్ లో విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు హార్దిక్ పాండ్యా. ఆ తర్వాత జరిగిన టీ20 వరల్డ్ కప్ లో హీరోగా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్ ప్రదర్శనతో అభిమానుల మనసులలో మరోసారి మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. తన వ్యక్తిగత జీవితంతో పాటు కెరియర్ లో ఎదురైన చేదు అనుభవాలను జయించి ఆటగాడిగా తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. దీంతో ఇప్పుడు హార్దిక్ పాండ్యాకు ప్రతిచోట పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా తన మాజీ భార్య పోస్ట్ కు ఇన్ స్టాగ్రామ్ లో హార్దిక్ పాండ్యా కామెంట్ చేయగా….దానికి అభిమానుల నుంచి క్రేజీగా కామెంట్లు వస్తున్నాయి. Hardik Pandya

Natasha and Hardik Pandya are going to meet again

టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా నటి నటాషాను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరు వివాహమైన నాలుగేళ్ల తర్వాత ఇటీవలే విడిపోయారు. వీరిద్దరి విడాకులకు గల కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. వీరిద్దరూ విడాకులకు ముందే నటాషా ఎన్నో రకాల ట్రోల్స్ ను ఎదుర్కొంది. ఇక విడాకుల అనంతరం నటాషా తన కుమారుడు అగస్త్యను తీసుకుని సెర్బియాకు వెళ్ళిపోయింది. ఇప్పుడు సెర్బియాలోనే ఉంటుంది. ఈ క్రమంలోనే తన కొడుకు సంతోషం కోసం అప్పుడప్పుడు బయటకు తీసుకొని వెళ్తోంది. Hardik Pandya

Also Read: IPL 2025: ఐపీఎల్ లో ఇక కొత్త రూల్స్.. ఏకంగా 6 ప్లేయర్స్ ?

అక్కడ కొన్ని ఫోటోలను దిగి వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. ఇక ఆ ఫోటోలను చూసిన హార్దిక్ పాండ్యా తనదైన స్టైల్ లో స్పందించాడు. ఇక రీసెంట్ గా నటాషా తన కుమారుడితో కలిసి ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోపై పాండ్యా రెండు రకాలుగా కామెంట్ చేశాడు. రెడ్ హాట్ ఎమోజితో నటాషా, అగస్త్య చిత్రాలపై వ్యాఖ్యానించి తన ప్రేమను చాటుకున్నాడు. హార్దిక్ చేసిన ఈ కామెంట్ చూసి తన అభిమానులు వీరిద్దరూ విడిపోయినప్పటికీ హార్దిక్ కు ప్రేమ ఇంకా అలానే మిగిలిపోయిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. Hardik Pandya

ఇక మరికొందరేమో చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేస్తారు. కానీ వీరు ఒకరినొకరు ఇంకా ఫాలో అవుతూనే అంటే వీరిద్దరికీ ఇంకా ప్రేమ అలానే మిగిలిపోయి ఉందని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. వీరిద్దరూ మళ్లీ కలుసుకుంటారని తన అభిమానులు అనుకుంటున్నారు. ఇక అలాగే ఈ పోస్ట్ పై హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా కూడా రెడ్ హాట్ ఎమోజిని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం హార్దిక్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. Hardik Pandya