Meena shocking comments on that hero

Meena: బాలనటిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల నటి మీనా ఆ తర్వాత హీరోయిన్ గా కూడా ఇండస్ట్రీలో రాణించింది.ఈమె తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్గా రాణించి 1990, 2020స్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఓ హీరో కోసమే స్విమ్ సూట్ వేసిందట.మరి ఆ హీరో ఎవరు ఎందుకు ఇష్టం లేకుండా ఆ పని చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.

Meena shocking comments on that hero

మీనా వెంకటేష్, బాలకృష్ణ,చిరంజీవి, నాగార్జున వంటి ఎంతోమంది స్టార్ హీరోలతో జత కట్టింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఈ స్టార్ హీరోలెవరికోసం స్విమ్ సూట్ వేసుకోలేదట. కానీ ఆ ఒక్క హీరో కోసం మాత్రం ఇష్టం లేకున్నా కూడా స్విమ్ సూట్ వేసుకుందట. (Meena)

Also Read: Sai Dharam Tej: ఆ హీరోయిన్ తో పెళ్లి.. రెండు కండిషన్లు పెట్టిన సాయి ధరమ్ తేజ్..!

ఇక ఆయన ఎవరో కాదు ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న నటుడు.. డైరెక్టర్.. డాన్సర్ కొరియోగ్రాఫర్ గా.. ఇండియన్ సినీ హిస్టరీలో ఎంతో మంచి గుర్తింపు గాంచిన ప్రభుదేవా.. మీనా ప్రభుదేవా కాంబినేషన్లో వచ్చిన ఒక సినిమా కోసం మొదటిసారి మీనా స్విమ్ సూట్ వేసుకోవాల్సి వచ్చిందట. అది వేసుకోవడం తనకి అస్సలు ఇష్టం లేదట.

 Meena shocking comments on that hero

అయినప్పటికీ ప్రభుదేవా చెప్పడంతో ఇష్టం లేకపోయినా కూడా ఆ స్విమ్ సూట్ వేసుకున్నానని, అది వేసుకొని మేకప్ రూమ్ నుండి బయటకు రావడానికి కూడా చాలా భయమేసిందని, కానీ అయిష్టంగానే దాన్ని ధరించానంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది .అంతేకాదు అలాంటి బట్టలు వేసుకుని గ్లామరస్ పాత్రల్లో నటించే వాళ్ళు ఎలా చేస్తారో ఏమో వాళ్లకి దండాలు పెట్టాలి అంటూ వారి ధైర్యాన్ని పొగుడుతూ కామెంట్స్ చేసింది.(Meena)