Do you know what Mahesh Babu calls Raghavendra Rao

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు మరికొద్ది రోజుల్లోనే పాన్ వరల్డ్ మూవీ లో నటించబోతున్నారు. అయితే రాజమౌళి కాంబినేషన్లో రాబోయే ఏ సినిమా అయినా సరే పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుంది.కానీ మహేష్ బాబుతో వచ్చే సినిమా మాత్రం పాన్ వరల్డ్ లెవెల్లో ఉంటుందని రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు. అయితే అలాంటి మహేష్ బాబు రాఘవేంద్రరావుని ఏమని పిలుస్తారో తెలిస్తే మీరంతా షాక్ అవుతారు. అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి బంధుత్వం లేదు.

Do you know what Mahesh Babu calls Raghavendra Rao

కానీ మహేష్ బాబు మాత్రం రాఘవేంద్ర రావుని సార్ లేదా డైరెక్టర్ గారు లేదా పేరు పెట్టి పిలవకుండా ఎంతో ప్రేమగా మామయ్య అని పిలుస్తారట.అయితే చిన్నప్పటినుండి రాఘవేంద్ర రావు తో మహేష్ బాబుకి మంచి కనెక్టివిటీ ఉండడం కారణంగా మహేష్ బాబు అలా రాఘవేంద్రరావుని మామయ్య అని పిలుస్తారట. ఇక మహేష్ బాబు మొదటి సినిమా రాజకుమారుడు మూవీకి కూడా రాఘవేంద్ర రావే దర్శకత్వం వహించారు. (Mahesh Babu)

Also Read: Heroine: నాలుగో పెళ్లికి రెడీ అయిన హీరోయిన్ ..?

అయితే మహేష్ బాబుకి మొదట యమలీల సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ కామెడీ మూవీ లో హీరోగా మహేష్ బాబు సెట్ అవ్వడని కృష్ణ ఈ మూవీ ని రిజెక్ట్ చేసి రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజకుమారుడు సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.అయితే ఈ సినిమా విడుదలై నేటితో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాంతో ఈ సినిమాకి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు నెట్టింట్లో మరొకసారి చక్కర్లు కొడుతున్నాయి.

Do you know what Mahesh Babu calls Raghavendra Rao

ఇక ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ వాళ్ళు నిర్మించారు. అలా మొదట విడుదలైన సమయంలో ఓకే టాక్ తెచ్చుకున్న రాజకుమారుడు మూవీ చివరికి 44 సెంటర్లలో వంద రోజులు ఆడి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.అలాగే ఈ సినిమాతో మహేష్ బాబు నటన,అందానికి, కామెడీకి ఫిదా అయిన సినీ ఇండస్ట్రీ మహేష్ కి ప్రిన్స్ అనే ట్యాగ్ ని కూడా ఇచ్చింది.(Mahesh Babu)